ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా నాయకుల పని తీరును, వారికి ప్రస్తుతం ప్రజల్లో ఉన్న పేరును అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసే దిశగా సాగుతుంది ఆ పార్టీ అధినాయకత్వం. అందులో భాగంగా చాలా కాలం నుండి మంత్రివర్గ ప్రక్షాళన అంటూ ఊరిస్తూ ఊరిస్తూ విస్తరణ అన్న పేరుతో ఈ మధ్య త్వరితగతిన పార్టీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ప్రజా ప్రతినిధుల పని తీరును బట్టి ర్యాంకులు కేటాయించారంట. ముఖ్యంగా చంద్రబాబు నాయుడే స్వయంగా కలుగజేసుకొని వారి గ్రేడులను బట్టి ర్యాంకులను ఇవ్వడం జరుగిందంటున్నారు. ఆ రకంగా డీగ్రేడ్ కు పడిపోయిన నాయకులకు టెన్షన్ పట్టుకుంది. వారిలో ప్రధానంగా బాగా ర్యాంకింగ్ పడిపోయిన నాయకులకు ముందు ముందు మంత్రివర్గ ప్రక్షాళన అన్నపేరుతో ఎవరిని తొలగిస్తారో ఎవరిని చేర్చుకుంటారో అన్న రీతిలో ఏపీ మంత్రులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని ప్రతిపాటి పుల్లారావుకు, రావెల కిశోర్ బాబుకు చమటలు పడుతున్నాయి. అలాగే విజయ నగరం జిల్లాకు చెందిన మృణాళినికి కూడా టెన్షన్ మొదలైనట్లు వినిపిస్తున్న టాక్.
ముఖ్యంగా రావెల కిశోర్ బాబు కుమారుల చేష్టలు ఆయన పదవీ గండానికి శాపంగా మారాయి. ఒక కొడుకు హైదరాబాద్ లోని ఓ మహిళ చేయి పట్టుకొని అడ్డంగా బుక్ అయితే, మరో కుమారుడు ఏకంగా ఓ లేడీస్ హాస్టల్ లోనే దూరి సంచలనం రేపాడు. ఇక ప్రతిపాటి పుల్లారావు అయితే ఆయన కుటుంబమే అతనికి శాపంగా మారింది. ఆయన నియోజక వర్గంలో కట్టుకున్న భార్య, బావమర్దులు కమీషన్లకు కక్కుర్తి పడటంతో అలా ప్రతిపాటికి కూడా పదవిగండం ఉన్నట్లుగానే టాక్ వినిపిస్తుంది. ఇకపోతే కిమిడి మృణాళినికి నియోజక వర్గంలో బాగా వ్యతిరేకత ఉంది. పనులు చేయడం చేతగాని నేతగా అక్కడ ముద్రపడటంతో ఆమెను కూడా తప్పించి ఆమె బావ అయిన ఏపీ తెదేపా అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఇంకా ఎవరు ఉంటారో ఎవరు ఊడుతారో తెలియక ఏపిలోని డీగ్రేడ్ స్థాయి మంత్రులు తీవ్ర ఒత్తిడికి లోనౌతున్నారు.
Advertisement
CJ Advs