ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాఫ్ట్ వేర్ రంగానికి పితామహుడుగా బిరుదాన్ని ఇస్తూ తనదైన ధోరణిలో మండిపడింది వైకాపా ఎమ్మెల్యే రోజా. తాజాగా శ్రీకాళహస్తిలో పర్యటించిన ఆమె చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చాలు అదేంటో తెలియదు గానీ కరువు విలయ తాండవం చేస్తుందంటూ వెల్లడించింది. సాఫ్ట్ వేర్ రంగానికే పితామహుడైన అంతటి ఘన చరిత్ర కలిగిన బాబు ఏపీ రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తున్నాడని అస్సలు అభివృద్ధి అన్నదే చేయడం లేదని ఆమె వివరించింది. ఇంకా రోజా మాట్లాడుతూ... చంద్రబాబు కరవుకు పాస్ వర్డ్ లాంటివాడని, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ గా దెప్పి పొడిచింది. అస్సలు చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా అయిన చిత్తూరులోని చక్కెర కర్మగారాన్ని ఎందుకు మూసి వేయించినట్లని ఆమె తెలిపింది.
ముఖ్యంగా చంద్రబాబు పాలనలో కరువు ఈ రకంగా విలయం తాండవం చేస్తుంటే ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రానికి వాస్తవ పరిస్థితులపై నివేదిక కూడా ఇవ్వకుండా ఎంత నిర్లక్షం చేస్తున్నారో దీన్ని చూస్తే అర్థమౌతుందని ఆమె విమర్శనాస్త్రాలు సంధించింది. రోజా ఇంకా మాట్లాడుతూ యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా కావాలని అసెంబ్లీ సాక్షిగా గళం ఎత్తిన తమ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేయడం ఎంతో విడ్డూరంగా ఉందంటూ ఆమె ధ్వజమెత్తింది.
Advertisement
CJ Advs