Advertisement
Google Ads BL

సంచలనం రేపేలా స్మృతి గతస్మృతులు!

smriti irani,smriti irani model life,smriti irani child wood life,smriti irani biography,smriti irani central minister | సంచలనం రేపేలా స్మృతి గతస్మృతులు!

భాజపా నేతగా, కేంద్రమంత్రిగా సుపరిచితురాలైన స్మృతి ఇరాని గతం తాలూకూ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. స్మృతి చిన్నప్పటి నుండి అంచలంచలుగా ఎదుగుతున్న తన ప్రస్తానానికి సంబంధించిన ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి. స్మృతి ఇరాని ‘జై బోలో తెలంగాణ‌’ చిత్రంలో తెలంగాణ త‌ల్లిగా న‌టించి తెలుగువారికి బాగా దగ్గరయ్యిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత స్మృతి రాజ‌కీయాల ద్వారా బాగా ప్రచారం పొందింది.

Advertisement
CJ Advs

అతి సాధారణ కుటుంబంలోంచి వచ్చిన స్మృతి ఇరానీ ఇప్పుడు అనుభవిస్తున్న స్థాయికి రావ‌డానికి చాలా కష్టాలను ఎదుర్కొన్నది.  అతి సామాన్య యువ‌తుల వలె స్మృతి యంగ్ లో ఉన్నప్పుడు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నది. ఫైన‌ల్ లిస్టులో చోటు  ద‌క్కించుకున్న స్మృతి ఇరాని అందాల రాణిగా కిరీటం గెలుచుకోలేక పోయినా తగిన గుర్తింపు మాత్రం దక్కించుకుందనే చెప్పాలి. అలా స్మృతి ఇరాని ఓ పక్క మోడ‌లింగ్ లో అవకాశాలు చూసుకుంటూనే పార్ట్ టైమ్ గా ఓ రెస్టారెంట్‌లో జాబ్ చేసింది. అక్కడ బల్లలను శుభ్రం చేసే పని నుంచి ఆర్డ‌ర్లు సప్ల‌య్ చేసే  స్థాయికి అంచలంచలుగా ఎదిగింది. అలా స్మృతి జీవనోపాది కోసం ఇటువంటి పనులను చాలానే చేసిందని చెప్పాలి. ఆ తర్వాత మోడ‌లింగ్‌ లో, టీవీ న‌టిగా మంచి అవ‌కాశాలను దక్కించుకుంది. బుల్లితెర‌పై కూడా న‌టిగా బాగా పాపుల‌రయ్యింది. మొట్ట మొదట టీవీలో చిన్న ప్రకటనలో  న‌టించింది స్మృతి. ఆ తర్వాత ఆల్బమ్ లో, మరో రెండు టీవీ సిరియల్స్ లలో నటించే అవకాశం వచ్చింది. అవి చూసిన శోభా కపూర్ తన కుమార్తె ఏక్తాకు రిక‌మండ్ చేశాడు. ఏక్తా డైలీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ లో తులసి పాత్ర స్మృతి ఇరాని జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత ఇప్పటి రాజకీయ అధికారాలు తెలిసిందే. అయితే ప్రస్తుతం స్మృతి ఇరానీ ఇమేజ్‌ను డేమేజ్ చేసేలా గతానికి సంబంధించిన ఫోటోలు (మోడ‌లింగ్ నాటివి) నెట్‌లో తీవ్రంగా ప్ర‌చారం జరుగుతున్నాయి. అవి వైరల్ గా మారి సంచలనం రేపుతున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs