Advertisement
Google Ads BL

నయనతార ఈసారి అట్నుంచి నరుక్కొస్తుంది!


అసలు భారతీయ సంప్రదాయం ప్రకారం అత్తా కోడళ్ళ అనుబంధం చాలా పవిత్రమైనది. కోడలికి ఎంత అంతస్తు ఉన్నా, అత్త అంగీకారంతోనే సకలం జరుగుతుంటాయి. అలాగే కోడలు కూడా అత్తకు గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందే. ఆ దిశగా పయనిస్తుంది మన సంస్కృతిలో భాగమైన సంప్రదాయం. ప్రస్తుతం నడుస్తున్న తీరు అక్కడక్కడ పాశ్చాత్య పోకడలతో కాస్త వేరుగా నడుస్తున్నా విషయం మాత్రం సంప్రదాయానికే పెద్ద పీట వేస్తారు. అలాగే ఈ లోకంలో ప్రేయసీ, ప్రియుడు ఎంతగా ప్రేమించుకున్నా చివరికి కుమారిడికి అమ్మ అంగీకారం ఉండాల్సిందే. అలా కాకపోతే మొదటికే ప్రమాదం వస్తుందన్నది ఆ ప్రేమికుల భయం.  అందాల భామ నయనతార... శింబు, ప్రభుదేవా తర్వాత తాజాగా యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. కాగా ఇంతకు ముందువలె తన ప్రేమకు ఏ విషయంలోనైనా అడ్డంకి ఏర్పడుతుందేమోనన్నభయంతో ముందుగానే ప్రేమించిన వారి కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకొనే పనిలో పడింది నయనతార.  

Advertisement
CJ Advs

‘నానూ రౌడీదాన్’ చిత్రం షూటింగ్ సందర్భంగా ఆ దర్శకుడు, నయనతార మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఏ కార్యక్రమానికైనా నయనతార, విఘ్నేష్ శివన్ లు కలిసి హాజరై హల్ చల్ చేస్తుండటం తెలిసిందే. కాగా అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీట లెక్కనున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా వినిపిస్తుంది.  ముఖ్యంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులిద్దరూ కూడా  పోలీసు అధికారులుగా పని చేసిన వారు కావడంతో అత్తామామలది కాస్త మెత్తని మనస్సే అయ్యి ఉంటుందని భావించిన నయనతార అందుకు తగిన విధంగా మచ్చిక చేసుకొని వారిని బుట్టలో వేసేసుకుందామన్న ఆలోచనలో పడిందన్న టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఒకసారి అనుకోకుండా విఘ్నేష్ తన తల్లికి నయనతారను పరిచయం చేయడంతో అదే ఛాన్స్ గా నయన అల్లుకుపోతున్నట్టు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. విఘ్నేష్ తల్లిని ఇంకా మచ్చిక చేసుకోవాలన్న తలంపుతో ఉన్న నయన తార ప్రియుడు తల్లిని ఏకంగా ఇంటికి ఆహ్వానించి స్వయంగా తన చేతులతో వంట చేసి మరీ విందు ఇచ్చిందట. మొత్తానికి నయన తార ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ప్రేమ అన్నా  ఫలించాలని తగిన విధంగా బాగానే కాకా పడుతుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs