Advertisement
Google Ads BL

మహేష్ సినిమా ఇలా రూపొందుతుంది..!


మురుగ‌దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబు సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సినిమాటోగ్రాఫ‌ర్‌గా సంతోష్ శివ‌న్‌ పని చేస్తున్నాడు.  సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా టెక్నికాలిటీని అద్ది ఓ రేంజ్ లో చిత్రీకరించే వ్యక్తిగా మంచి పేరున్న వ్యక్తి. దాంతో మహేష్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు  ఈ సినిమా కోసమని దర్శకుడు మురుగ‌దాస్‌, సంతోష్‌శివ‌న్‌లు తెగ కష్టించి పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న మ‌హేష్‌ సినిమా కోసం ఓ కార్ ఛేజింగ్ దృశ్యాలను చిత్రీకరించాలి. ఈ సన్నివేశం నేప‌థ్యంగా కొన్ని దృశ్యాలను తెర‌కెక్కిస్తున్నారు. ఇది  పీట‌ర్ హెయిన్స్ పర్యవేక్షణలో ఈ ఛేజ్ సన్నివేశం తెర‌కెక్కుతుంది. దీన్ని సంతోష్ శివ‌న్ చాలా అద్భుతంగా తీస్తున్నాడు. ఎంతో అడ్వాన్స్ డ్ ఉన్న కెమెరాలను, క్రేన్‌ల‌ను ఉపయోగిస్తూ  ఆ సన్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. మొత్తం సినిమాలో ఈ ఛేజింగ్ హైలెట్ గా నిలుస్తుందని చిత్రబృందం ద్వారా తెలుస్తుంది. కాగా సంతోష్ శివ‌న్ వాడుతున్న కెమెరాల్ని తన ట్విట్ట‌ర్‌ ద్వారా పోస్ట్ చేసి చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.  ఈ కెమెరా చూస్తుంటే చాలా ఆశ్చ‌ర్య‌మేస్తుంది. ఆక్టోప‌స్ త‌ర‌హా డ్రోన్‌కి కెమెరాని బిగించి ఈ కార్ ఛేజ్‌ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు. ఇంకా నాలుగైదు కెమెరాల‌తో ఈ షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే  హైద‌రాబాద్‌లోనే ఇంకా కొన్నిరోజులపాటు ఈ ఛేజింగ్‌నూ, కీల‌కమైన స‌న్నివేశాలను తెర‌కెక్కించనున్నట్లు అందిన సమాచారాన్న బట్టి తెలుస్తుంది.  కాగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రం తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs