Advertisement
Google Ads BL

చిరు 151 వ మూవీ తాజా అప్ డేట్..!


మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ‘ఖైదీ నెం. 150’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. వి.వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికల్లా అన్నీ పూర్తి చేసుకొని పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా ఈ మధ్య చిరంజీవి 151 వ సినిమా గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని కూడా వార్తలు వినిపించాయి.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజా వార్త ఏంటంటే  చిరంజీవి, బోయపాటి ల కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.  అశ్వనీదత్ గత చరిత్రను తరచి చూస్తే 1980- 90 దశకంలో అశ్వనీదత్  సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో క్రేజీగా భావించి చూసేవారు.  అన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలే. ఒకప్పటి భారీ నిర్మాత అయిన అశ్వనీదత్ అప్పట్లో వైజయంతి పతాకంపైనే అదీ చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు తీసాడు.  అయితే ఈ మధ్య కొంత  గ్యాప్ తీసుకున్న అశ్వనీదత్  తిరిగి మెగాస్టార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.  కానీ చిరంజీవితో బారీగా నిర్మించే ఈ చిత్రానికి అశ్వినీదత్ తో పాటు అల్లు అరవింద్ కూడా కలిసిపోయి చేసుకొనే దిశగా  ఆలోచిస్తున్నట్లు కూడా ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సినిమా కథపై బోయపాటి తీవ్రంగా కుస్తీపడుతున్నట్లు సమాచారం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs