Advertisement

పాక్ శాంతి మంత్రం.. ఎందుకో తెలుసా?


గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కీలక సమావేశం జరిగింది. వీరి భేటిలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యాతో కలిసి ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు మోడీ. వాటిలో కుడంకుళం న్యూక్లియర్ ప్లాంట్, రైల్వేలు, స్మార్ట్ సిటీలు, నౌకా నిర్మాణం వంటి 16 అంశాలపై కీలక సంతకాలు జరిగాయి. 

Advertisement

ఇందులో భాగంగా భారత్ తో రష్యా కుదుర్చుకున్న డిఫెన్స్ డీల్  చాలా కీలకమైంది. దీంతో రూ.39000 కోట్లతో భారీ అధునాతమైన విమాన విధ్వంసక రక్షణ వ్యవస్థ అయిన 'ఎస్-400 ట్రియంఫ్' సేకరణకకు రష్యాతో భారత్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉన్న ఎస్-400 ట్రియంఫ్ లను కొనుగోలు చేయడం భారత్  వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ తో భారత్ కు యుద్ధం జరగవచ్చన్న ఊహాగానాలు వస్తుండటంతో చైనా, పాకిస్తాన్ కు సంబంధించిన సరిహద్దుల వెంట భారత్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది.  ఇకపోతే వీటిద్వారా 400 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న శత్రువుల యుద్ధ విమానాలను, ఇంకా క్షిపణలు, డ్రోనులనూ కూడా ఎప్పటికప్పుడు ధ్వంసం చేయవచ్చని సైనికాధికారులు వెల్లడిస్తున్నారు. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఈ రక్షణ వ్యవస్థకు ఉందని తెలుస్తుంది. కాగా ఇదే సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తోనూ, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమాతోనూ, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్ తో కూడా కలిసి చర్చలు జరపనున్నాడు మోడి.  ముఖ్యంగా చైనా అధ్యక్షుడితో మోడీ జరిపే చర్చల్లో ఎన్ ఎస్జీ- పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, పాక్-చైనా ఆర్థిక కారిడార్ వంటి పలు కీలక విషయాలపై చర్చలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

భారత్ తో కీలకమైన రక్షణ వ్యవస్థకు సంబంధించి రష్యా ఒప్పదం కుదుర్చుకోవడంతో పాకిస్తాన్ భయపడుతుందనే చెప్పాలి. అందుకనే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఉన్నఫలంగా శాంతిమంత్రాన్ని జపిస్తున్నాడు.  భారత్, పాకిస్తాన్ మధ్య అశాంతికి కారణం కాశ్మీర్ అంశమే అని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించాడు. కాబట్టి భారత్ తో ఈ జఠిలమైన అంతే సున్నితమైన ఈ సమస్యపై చర్చలు జరిపేందుకు పాక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నవాజ్ షరీఫ్ వెల్లడించాడు.  ఈ విషయంపై చర్చించడానికి భారత్ అంగీకరిస్తే తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించాడు.  కాగా కాశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు గురించి, కొనసాగుతున్న హింసపై చర్చించడానికి తాము పలుసార్లు భారత్ ను కోరినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని షరీఫ్ వివరించాడు.  ఇప్పుడు ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచనతో అయినా భారత్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే బాగుంటుందని ఆయన తెలిపాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement