త్రివిక్రమ్ ఏదైనా సినిమాకు మాటలు రాసినా లేక అతని డైరెక్షన్ లో గనక సినిమా ఏదైనా వస్తుంది అంటే అతను రాసే డైలాగ్స్ కి ప్రేక్షకులు మంత్రముగ్దులవుతారు. అతని సినిమాలో డైలాగ్స్ మనసుకు హత్తుకుపోతాయి అంటే అతిశయోక్తి కాదు. అందుకే త్రివిక్రమ్ ని అందరూ మాటల మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మరో రైటర్ కమ్ డైరెక్టర్ అంటే ఇష్టమని చెబుతున్నాడు. అతనెవరంటే.... 'ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద' సినిమాలతో హిట్ కొట్టిన అవసరాల శ్రీనివాస్ అన్నా... అతని రైటింగ్ స్కిల్స్ అన్నా త్రివిక్రమ్ కి బాగా ఇష్టమట.
అందుకే అవసరాల శ్రీనివాస్ తో ఒక సినిమా తియ్యాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. త్రివిక్రమ్ తన సొంత ప్రొడక్షన్ లో అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి అంతటి గొప్ప దర్శకుడు తనని, తన రైటింగ్ స్కిల్స్ ని, దర్శకత్వాన్ని మెచ్చుకుంటుంటే అవసరాల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. ఇక పొగడడం అటుంచి త్రివిక్రమ్ నిర్మాణ సారధ్యం లో దర్శకత్వం వహించడం తన అదృష్టం గా భావిస్తున్నాని సన్నిహితులు దగ్గర చెప్పుకుంటున్నాడట. ఇక త్రివిక్రమ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా సినిమా తీస్తానని అంటున్నాడట.
ఇప్పటికే తాను తీసిన రెండు సినిమాల్తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని... అటు క్రిటిక్స్ నుండి కూడా మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో జతకట్టి సినిమాని తెరకెక్కిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎంతైనా అవసరాల వ్యవహారం తంతే బూరెల బుట్టలో పడ్డట్టుంది అతని ఇండస్ట్రీ అంతా అనుకుంటుండటం విశేషం.