Advertisement
Google Ads BL

ఇలా అయితే రకుల్ పై యాక్షన్ తప్పదు!


గతంలో తెలుగు స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ రెండు చిత్రాలకు ఓకే చెప్పి, బిజీ కారణంగా ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లను వదులుకుంది. చివరకు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం విషయంలో కూడా అదే పనిచేసింది. ఆ తర్వాత జరగిన పొరపాటును చూసి ఇకపై అలా చేయను.. అంటూ మాట ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఆమె మరోసారి మాటతప్పింది. ప్రస్తుతం రకుల్‌ రామ్‌చరణ్‌ సరసన 'ధృవ', మహేష్‌బాబు - మురుగదాస్‌ చిత్రాలతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, సాయిధరమ్‌తేజ్‌లతో కలిసి నటిస్తోంది. ఇదే సమయంలోనే ఆమె విశాల్‌ హీరోగా రూపొందే ఓ చిత్రంలో నటిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మరోసారి విశాల్‌కు హ్యాండిచ్చింది. దీంతో ప్రస్తుతం పలు చిత్రాల నిర్మాతలు తమకు రకుల్‌ వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ దక్షిణ భారత నటీనటుల సంఘంకు కంప్లైంట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె మొదట ఒప్పుకునేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించాలని అంతేగానీ చివరి క్షణంలో రిక్తహస్తం చూపిస్తే ఆమెకు మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. కాగా విశాల్‌ చిత్రంలో ఇప్పుడు రకుల్‌ స్దానంలో అను ఇమ్మానియేల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs