Advertisement
Google Ads BL

బ్రాహ్మిణి సర్వే..చంద్రబాబు స్కెచ్చా?


ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మిణి టీడీపీ పై ప్రజలకు ఎంత విశ్వాసం వుందో అనేదానిమీద ఒక సర్వే చేయించిందని ఒకటే ప్రచారం జరుగుతుంది. కేవలం టీడీపీ పై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వుంది. ఎంతవరకు ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది.... అసలు వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు టిడిపి కి వస్తాయనే దాని మీద సర్వే చేయించిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సర్వేలో టిడిపికి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఈ సర్వేలో టిడిపి కేవలం 57 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని మిగతావి... వైసిపి ఇంకా పవన్ జనసేన , బిజెపి వాళ్లకి దక్కుతాయని సర్వే లో వెల్లడైందని చెబుతున్నారు. ఇక ప్రతిపక్షాలలో వైసిపి కొంచెం గట్టి పొజిషన్ లోనే  ఉందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయట. ఇక ఈ ఫలితాలు చంద్రబాబుని కూడా కంగారు పెట్టిస్తున్నాయని అందుకే ఏపీ పాలనపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నాడని.... అలాగే మంత్రులకి రోజుకో క్లాస్ ఇస్తున్నాడని ప్రచారం మొదలైంది.

Advertisement
CJ Advs

అయితే ఇదంతా కావాలని చంద్రబాబే తన కోడలు బ్రహ్మణీ తో చేయిస్తున్నాడని మరో వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. అదెలా అంటే టీడీపీకి కేవలం 60 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది కాబట్టి.... ఇక నుండి అభివృద్ధి కార్యక్రమాలు గట్రా కొంచెం ఎక్కువగా చేసి ప్రజల మన్ననలు పొందడానికి బాబు ట్రై చెయ్యొచ్చు. ఇంకా మంత్రులు కూడా తన పని తీరు మెరుగు పరుచుకుని ప్రజల్లోకి చొచ్చుకుపోతారు... అందుకే రోజూ మంత్రులకు, నేతలకు పెద్ద క్లాస్ లు తీసుకుని చంద్రబాబు తన పనులను చక్కబెడుతున్నాడు. ఇక కొడుకు లోకేష్ ని కూడా వదలకుండా అతనితో ప్రజా సమస్యలు తీర్చడానికి కావాల్సిన పనులు చేపిస్తూ అందరికి చుక్కలు చూపిస్తున్నాడు. అసలిదంతా బాబు కావాలనే చేస్తున్నాడట. బ్రాహ్మిణి చేయించిన సర్వేలో టిడిపికే అనుకూలం గా వచ్చిందని... ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికే బాబు ఇదంతా ప్లే చేస్తున్నాడని అంటున్నారు.

ఇక ఎలాగూ వైసిపి కి అనుకూలం గా ఈ సర్వే రావడం తో వారు కొంచెం నెమ్మదిస్తారు. ఎందుకంటే ఎలాగూ వారికి వచ్చే ఎన్నికల్లో ఫెవర్ గా వుంది కాబట్టి వీరు చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా బద్ధకించేస్తారు. ఇక మిగతా పార్టీల వాళ్ళు ఎంతగా కష్టపడినా కూడా వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీన్ లేదుకాబట్టి చంద్రబాబు తన కోడలితో ఈ సర్వే నాటకాన్ని నడిపించాడని అంటున్నారు. మరి బాబుని అపర చాణిక్యుడు అని ఊరికే అనలేదు. ఇక ఎలాగూ రాజధాని అంటూ బాబు అమరావతిని డెవెలెప్ చేయాలని..... తాత్కాలిక సచివాలయం, ఇంకా మిగతా శాఖలకు సంబంధిత ఆఫీస్ లను కూడా బాబు ఇప్పటికే ఓపెన్ చేసేసాడు. మిగతా నిర్మాణాలు కూడా దాదాపు సగం పూర్తయ్యాయి. ఒకవేళ బాబుకి వచ్చే ఎన్నికల్లో గనక అధికారం చేతికి రాకపోతే వేరే వాళ్ళు అధికారం చేపడితే మాత్రం వాళ్ళ వల్ల ఈ పనులు సాధ్యం కావు. అందుకే ఖచ్చితం గా చంద్రబాబుకే తమ ఓటు వెయ్యాలని ప్రజలు భావిస్తారు. అసలిప్పటికీ ఏపీలో టిడిపి కి అనుకూలం గానే పవనాలు వీస్తున్నాయని.... వచ్చే ఎన్నికల్లో ఖచ్చితం గా టిడిపి అధికారం చేపట్టడం ఖాయం గా కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు జోష్యం చెబుతున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs