Advertisement

కేసీఆర్‌ పస తగ్గింది....నస ఎక్కువైంది!


ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు మూడేళ్లు అవుతున్నా తెలంగాణలో మాత్రం ఇప్పటికీ టిఆర్‌ఎస్‌ హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుందని ఆ సర్వే తెలిపింది. కానీ పరిస్దితి అంతా సజావుగా సాగుతున్నదని చెప్పలేం. జిల్లాల పునర్‌విభజన అంశం కేసీఆర్‌ మెడకే చుట్టుకునేట్లు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు తమ ప్రాంతాన్ని జిల్లా చేయమని, లేకపోతే ఊరుకోమనే భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇక ఇదే సమయంలో అధికారం చేపట్టే నాటికి మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ కేసీఆర్‌ అండ్‌ పార్టీ చేస్తున్న దుబారా వల్ల, పెరిగిపోయిన అవినీతి వల్ల ఇప్పుడు లోటు బడ్జెట్‌లో కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ. బిసీలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వలేని పరిస్దితులు నెలకొని ఉన్నాయి. కేసీఆర్‌ వస్తాడు... ఆశలు తీరుస్తాడని ఆశించిన మెజార్టీ రైతులు ఇప్పుడు అయ్యో రామా... అనే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఆంధ్రాలో కంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పలు విత్తన కంపెనీలలో రూపొందేవి బోగస్‌ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికే ఎనిమిది నకిలి విత్తనాల కంపెనీలు ఉన్నాయని అధికారులు నిర్ణయించినప్పటికీ ఆయా కంపెనీలను బ్యాన్‌ చేయాలన్న అధికారుల నిర్ణయాలను అధికార పార్టీ తమ అండదండలతో వాటిని బ్యాన్‌ చేయకుండా రాజకీయాలు చేశారంటూ మృతుల బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఇటు అంధ్రాలో, అటు తెలంగాణలో కూడా అధికార టిడిపి, టిఆర్‌ఎస్‌లు దొందూ దొందేనని ఒప్పుకోవాల్సిందే. కాగా కేసీఆర్‌ చేస్తున్న పనులను స్వయాన జేఏసీ చైర్మన్‌ కోదండరాంతో సహా పలు ప్రజాస్వామిక వాదులు చేయి ఎత్తి చూపేలా పాలకుల తీరు కనపడుతోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement