మెగాస్టార్ గా ఇమేజ్ సంపాదించుకోవడానికి చిరంజీవి చాలా కష్టపడ్డాడు. ఆ ఇమేజ్ తో దశాబ్దాల పాటు వెండి తెరపై ఓ వెలుగు వెలిగాడనే చెప్పాలి. ఆ తర్వాత దురదృష్ట వశాత్తు రాజకీయ రంగ ప్రవేశం చేసి అందులోనూ కేంద్రాస్థాయి మంత్రి పదవులను దక్కించుకొనే ఓ రేంజ్ లో రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొని చివరికి అందులోనూ విజేయుడుగానే నిలిచాడు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలను పక్కన పెట్టిన మెగాస్టార్ మళ్లీ ఇప్పుడు తన 150వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజకీయంగా అంతగా పట్టించుకోకుండా సినిమాపైనే పూర్తిగా దృష్టి సారించాడని తెలుస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ వెండితెర మీదే కాకుండా బుల్లితెరపై కూడా అలరించడానికి వచ్చేయుచున్న విషయం తెలిసిందే. కాగా మా టివిలో బాగా పాపులర్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా చిరు బుల్లి తెరపై కూడా వెలిగిపోనున్నాడు.
కాగా మా టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం తొలి మూడు సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వస్తున్న నాలుగో సీజన్ లోకి చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం విశేషంగా చెప్పవచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ కు సంబందించి షాక్ కు గురిచేసే న్యూస్ ఒకటి బయట వినిపిస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడులో ఒక్కో ఎపిసోడ్ కోసం చిరంజీవి రూ.10 లక్షల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే చిరంజీవి వెండితెర మాదిరిలా బుల్లితెరపై కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోలా చేరిపోయాడని టాక్ వినిపిస్తుంది.