ఒకప్పుడు రైటర్ తెరవెనుక పాత్రధారణకే పరిమితమయ్యేవాడు. ఇప్పుడైతే రైటర్ లు కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొనే స్థాయికి ఎదుగుతున్న విషయం తెలిసిందే. ఆ విషయంలో ఆ స్థాయికి చేరుకొని ప్రత్యక్షంగా నిరూపించుకుంటున్న చెయితిరిగిన రచయిత, డైరెక్టర్ కోనా వెంకట్. రచయితగా రికార్డు సృష్టించి, అటు ఆన్ స్క్రీన్ మీద, ఇటు ఆఫ్ స్క్రీన్ లోనూ పేరు ప్రఖ్యాతులు గడించాడు కోనా వెంకట్. ప్రస్తుతం నిర్మాతగా కూడా కోనా రాణిస్తున్న విషయం తెలిసిందే.
మరెందుకనో గత కొంత కాలంగా కోనా వెంకట్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఆ మధ్య దర్శకత్వమే తన తరువాత ఎపిసోడ్ అన్నారు కానీ తర్వాత ఎందుకనో ఈ మధ్య అటువైపు మోజు తగ్గించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్య ఒక షార్ట్ ఫిలిం వెబ్ సీరీస్ అని వస్తుంది అన్నారుగానీ అది ఇంకా దర్శనానికి నోచుకోలేదు. కానీ కోనా వెంకట్ ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తన లక్ష్యాన్ని గురించి ప్రస్తావించాడు. తాను ఎమ్మెల్యేగానీ , ఎంపీగానీ కావాలనుకుంటున్నానని గొప్ప కబురును చాలా సగౌరవంగా ప్రకటించాడు. తన లక్ష్యం రాజకీయాలని అటువైపు ఆసక్తి ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. కోనా అలా అన్నాడో లేదో రాజకీయ విశ్లేషకులు మాత్రం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని 2019 ఎన్నికలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున కోనా వెంకట్ ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఎంపీగానైనా లేకా పవన్ తర్వాత స్థానాన్ని కోనాకి ఇచ్చే ఆలోచనలు కూడా జరుగుతున్నాయంటూ ప్రచారం సాగుతుంది. దీనికి సరైన సాక్ష్యంగా సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు, కోనా వెంకట్ కు మధ్య చాలా సన్నిహిత సంబంధాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి టాక్ నడుస్తుందని చెప్పవచ్చు. కాగా వారి మధ్య ఉన్న అలాంటి సబంధంపై కొన్ని నెలల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.