తెదేపా నాయకుడు నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకొని వైకాపా స్వరాన్ని పెంచుతుంది. తెదేపాలో చంద్రబాబు తర్వాత లోకేష్ కీలకంగా మారనున్నాడన్న సంకేతాలు అందుకున్న తరుణంలో వైకాపా ఆ దిశగా లోకేష్ లక్ష్యంగా చేసుకొని గతంలో వాడుకున్న బాణాలతో గురిపెడుతుంది. అందులో భాగంగానే లోకేష్ పై గత కొన్ని రోజులుగా అవాకులు చవాకులు పేలుస్తూ హాట్ హాట్ కామెంట్లు గుప్పిస్తున్నారు వైకాపా నాయకులు. రాజకీయాల్లో ఓనమాలు రాని లోకేష్ కు తెదేపా అధిక ప్రాధాన్యం ఇస్తుందంటూ వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాగా చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టి లోకేష్ మీద పడటంతో ఉన్న ఫలంగా తెదేపా నాయకులు రకరకాల ఆలోచనలతో మదనపడుతున్నారు.
ఉన్నట్టుండి వైకాపా నాయకులు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ కు బలమైన నాయకుడుగా లోకేష్ ఎదగనున్నాడనే సంకేతాలు రావడంతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు 2019 ఎన్నికల దిశగా చాలా జాగ్రత్తగా రాజకీయ వర్గాలను సృష్టించుకుంటూ అందుకు తగిన అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి వచ్చే ఎన్నికల్లో కూడా వైకాపాకి చంద్రబాబు విషయంలో ఎదురుదెబ్బ తగలనుందనే భయంతో ముందు లోకేష్ ను కట్టడి చేసేలా వైకాపా వర్గం చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. కాగా తెదేపా పార్టీ అధినాయకుడికి వారసుడిగా పార్టీ పగ్గాలను 2024కి పూర్తిగా లోకేష్ కి అప్పజెప్పాలన్న సంకేతాలు వెలువడుతుండటంతో ఆ నాటికైనా వైకాపా బలపడేందుకు లోకేష్ ను అధిగమించేందుకు ఇప్పటినుండే వైకాపా ఆలోచిస్తుందన్న భావనా రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతుంది. అందుకనే లోకేష్ పై ఇలాంటి విష ప్రచారం చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. లోకేష్ కు రాజకీయాల్లో ఓనమాలు కూడా రావంటూ ఆడేసుకుంటున్నారు. అయితే మొత్తానికి ఈయన మారడంటూ చంద్రబాబును వదిలేసిన వైకాపా ఇప్పుడు లోకేష్ పై తీవ్రంగా ఫైట్ చేస్తుంది. ఈ ఫైట్ లో చివరికి ఏం జరుగుతుందో చూడాలి.