Advertisement
Google Ads BL

'వంగవీటి' లో వర్మ స్పెషల్ కూడా..!


ప్రముఖ  సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంటాడు. పాత నుండి తాజా తాజాగా ఉండే విషయాలవైపు పయనిస్తూ అప్ డేట్ అవుతూ ఉంటాడు. అలాంటి దర్శకుడు కాబట్టే వర్మ అంటే సంచలనం అయ్యాడు. తాజాగా వర్మ రూపొందిస్తున్న కొత్త చిత్రం వంగ‌వీటి విష‌యంలో ఓ కొత్త పంథాను ప్రవేశ పెట్టాడు. వంగవీటి ట్రైలర్ రూపంలో మూడున్నర నిమిషాల నిడివి ఉన్న షాట్స్ ను  చూపించాడు వ‌ర్మ‌.  తెలుగులో ఇప్పటివపరకు ఇంత పెద్ద లెంగ్త్ ఉన్న ట్రైల‌ర్ మ‌రొకటి కనిపించలేదనే చెప్పాలి. తాజాగా వర్మ వంగ‌వీటిలో కొన్ని షాట్స్ అంటూ.. ట్రైల‌ర్ ను వ‌దిలాడు. డైలాగులు లేని ఈ ట్రైలర్ లో.. సినిమాలో కొన్ని ముఖ్య ఘ‌ట్టాల్ని ఎలా తెర‌కెక్కించాడో వ‌ర్మ చూపించాడు. 

Advertisement
CJ Advs

ట్రైల‌ర్లు, టీజ‌ర్లు వంటివి విడుదల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోలు భయపడతారు. ఎందుకంటే ఇలాంటి వాటి ద్వారా సినిమా ముందుగానే అర్థమైపోతే తర్వాత కష్టమని వారి భయానికి కారణం.  కానీ రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుద‌ల చేసిన వీడియోలో కొన్ని షాట్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. వ‌ర్మ మార్క్ టేకింగ్‌కి అద్దం పట్టేలా ఉండే కెమెరా మూమెంట్స్ తో ప్రేక్షకుల్లో ముఖ్యంగా వర్మ అభిమానులు సంబరపడుతున్నారు. భారీ అంచ‌నాలను పెట్టుకుంటున్నారు. కాగా వర్మ తెలుగులో ఇదే చివ‌రి సినిమా అని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అందుకనే వర్మ  ఈ సినిమాపై ఎక్కువ ఏకాగ్రత పెట్టుకొని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. వర్మ దర్శకత్వం వహించిన వాటిలో ఎక్కువ ప్లాప్ మరెన్నో సంచనాలు కలవి ఉన్నా అప్పుడప్పుడు త‌న‌దైన శైలిలో సినిమాను తెరకెక్కించడం వర్మ స్పెషాలిటీ. కాగా తాజాగా వర్మ చేస్తున్న వంగవీటి ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో..వర్మ ని ఇంకెంత సంచలనం చేస్తుందో అనే విధంగా ఈ ట్రైలర్ టాక్ ఉండటం విశేషం. 

Click Here to see the Vangaveeti Chitram Loni Konni Shotlu Video

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs