Advertisement
Google Ads BL

ద్రువ కెపాసిటీ తెల్పేలా పండుగ టీజర్..!

dhruva dasara teaser,dhruva capasity on festival teaser,hero ram charan,dhruva director surender reddy | ద్రువ కెపాసిటీ తెల్పేలా పండుగ టీజర్..!

బ్రుస్ లీ సినిమా వచ్చి చాలాకాలం అయ్యింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ చాల గ్యాప్ తీసుకుని సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా ని రీమేక్ చేస్తూ ధ్రువతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అయితే తమిళ్ ఫ్లేవర్ లో వున్న తని ఒరువన్ ని చాలా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు తెలుగులో తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి రామ్ చరణ్ కూడా ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉండి బాగా కష్టపడుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుంది. ఈ సినిమాని ఎలాగైనా దసరాకి విడుదల చెయ్యాలని ధ్రువ టీమ్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే మెగా అభిమానులను నిరాశ పరచడం ఇష్టం లేని రామ్ చరణ్ ఈ దసరాకి ఈ టీజర్ తో పండగ చేసుకోండంటూ అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ ధ్రువ సినిమా టీజర్ ని విజయ దశమి కానుకగా చిత్ర యూనిట్ ఈ  రోజు విడుదల చేసింది. ఇక ఈ టీజర్ లో రామ్ చరణ్ ఫుల్ ఎనర్జీతో రెచ్చిపోయాడు. ఈ టీజర్ డైలాగ్స్ కూడా సినిమా మీద హైప్ ని క్రియేట్ చేస్తుందనే చెప్పవచ్చు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే.. నీ క్యారెక్టర్ తెలుస్తుంది. అదే నీ శత్రువు ఎవరో తెలిస్తే.. నీ కెపాసిటీ తెలుస్తుంది అంటూ రామ్ చరణ్ డైలాగ్స్ అదిరాయనే చెప్పాలి. రామ్ చరణ్ ఈ సినిమాలో చాల డీసెంట్ లుక్ తో కనిపిస్తాడని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని తహ తహ లాడుతున్నట్టుంది ఈ టీజర్ ని చూసిన వాళ్లకి. ఇక డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని రకాలుగా ఈ ధ్రువ చిత్రం సిద్ధమవుతుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs