టాలీవుడ్ హీరో రానా బాహుబలి2 ది కన్ క్లూజన్ చిత్రం షూటింగ్ ముగించుకొని మరో కొత్త సినిమాకు సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. రానా తన తండ్రీ ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఓ సెల్ఫీ తీసుకొని దాన్ని ట్విట్టర్లో పెట్టాడు రానా. అంతటితో ఆగకుండా రానా తాను మొదటి సారి ఈ నిర్మాతతో పనిచేయబోతున్నాను, ఆయనెవరో తెలుసా మానాన్నే అంటూ వివరించాడు.
ఎప్పుడూ ట్విట్టర్ లో చాలా హుషారుగా ఉండే.. తెలంగాణ రాష్ట్రం యువ నాయకుడు, కేసీఆర్ గారాల కొడుకు, తెలంగాణ హీరో కేటీఆర్ రానా ట్విట్టర్ కు స్పందిస్తూ.. రానా! నేనో చిన్న విషయం చెప్తాను. అది నీవు ఎలా పాటిస్తావో నీ ఇష్టం. సలహాగానో లేకపోతే హెచ్చరికగానో ఎలాగైనా తీసుకో.. అదేంటంటే ఈ నాన్నలున్నారు చూడు వాళ్ళంతా ఎప్పుడూ అత్యంత క్లిష్టమైన బాసుల్లాగానే ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ పేర్కొన్నాడు. అందుకు తిరిగి రానా ప్రతిస్పందిస్తూ నిజమే సార్ థ్యాంక్యూ.. మీ అంతరంగాన్ని అర్థం చేసుకున్నాను. తప్పకుండా అనుసరిస్తాను అంటూ ఇద్దరూ ట్విట్టర్ వేదికగా తెగ సంబరపడి పోయారనుకో.
Advertisement
CJ Advs