నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇప్పుడు పరిశ్రమలో హిట్ అనివార్యం. అందుకోసమని కళ్యాణ్ రామ్ ఇజంతో తెగ కుస్తీలు పడుతున్నాడు. కళ్యాణ్ రామ్ కు పటాస్ విజయాన్ని అందించినా ఆ తర్వాత వచ్చిన షేర్ మాత్రం నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఇజం చిత్రాన్ని దర్శకత్వం వహించిన పూరీకి కూడా ఇజం చిత్రం విజయం చాలా అవసరంగా మారింది. జ్యోతిలక్ష్మి, లోపర్ వంటి చిత్రాల ద్వారా పరాభవాన్ని చవి చూసిన పూరి ఇజం విజయం కోసం తపిస్తున్నాడు. కళ్యామ్ రామ్ కెరీర్లోనే అత్యంత బారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కాగా ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్ 20వ తేదీ నాడు విడుదల చేయాలని చూసినా తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ డేటు కాస్త అక్టోబర్ 21కి మారిందని సమాచారం. ఇజం 21వ తేదీ విడుదలౌతుందని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అదే రోజు ఇజం విడుదల చేసేందుకు డేటు ఖాయం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కాగా అదే రోజు నారా రోహిత్ శంకర్ సినిమాను కూడా విడుదల చేసేందుకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తుంది.
నారా రోహిత్ కూడా ఈ మధ్య విడుదలైన జో అచ్యుతానంద చిత్రం ద్వారా మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాతినేని దర్శకత్వం వహించి తమిళంలో విజయవంతమైన మౌనగురు చిత్రాన్ని శంకర అన్న పేరుతో రీమేక్ చేశారు. శంకర చిత్రంలో నారా రోహిత్ హీరో. ఈ సినిమా కూడా ఇదే రోజున విడుదల కానుండటంతో పరిశ్రమలో నందమూరి సినిమాకు, నారావారి సినిమాకు మధ్య పోటీ నెలకొంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
CJ Advs