Advertisement
Google Ads BL

తల్లి చిరుతో... కూతురు బన్నీ తో...!!


మలయాళ భామలకు, మలయాళ చిత్రాలలో పేరు తెచ్చుకున్న భామలకు ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగతిస్తుంది. ఆ కోవలోనే తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది కీర్తి సురేష్. మద్రాస్ వాసి అయిన కీర్తి సురేష్ ముందుగా మలయాళ చిత్రాలతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఎక్కువ ఆర్భాటాలు లేని పక్కింటి అమ్మాయిగా కనిపించే కీర్తి సురేష్ తన సహజ అందాలతోనే కాక నటనతోనూ నేను శైలజ, రైల్ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటిస్తుంది.

Advertisement
CJ Advs

దువ్వాడ జగన్నాథంతో పాటు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో చెయ్యబోతున్న చిత్రానికి ఎప్పటి నుంచో కీర్తి సురేష్ పేరు చర్చల్లో ఉంది. ఇప్పుడు లింగుస్వామి బృందం కీర్తి సురేష్ పేరును ఖరారు చేసింది. తెలుగులో పెద్ద నటుల సరసన అందులోనూ మెగా ఫ్యామిలీ హీరోతో నటించటం కీర్తి సురేష్ కి ఇదే తొలిసారి. కానీ కీర్తి సురేష్ తల్లి అయిన మేనకకు మెగా స్టార్ చిరంజీవితో కలిసి నటించిన అనుభవం ఉంది. చిరంజీవి నటించిన పున్నమినాగు చిత్రంలో మేనక చిరుతో కలిసి నటించారు.

మళ్లీ ఇప్పుడు చిరు మేనల్లుడుతో అలనాటి నటి మేనక పుత్రిక నటిస్తుండటం విశేషం. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న నేను లోకల్ చిత్రానికి నిర్మాణ భాగస్వామి అయిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీర్తి తాజా తమిళ చిత్రం రెమోని తెలుగులో అదే పేరుతో అనువదించి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs