Advertisement
Google Ads BL

పవన్ ఏది చేసినా అది జనం కోసమే!


జనసేన పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలకి సేవ చెయ్యాలని ఉవ్విళ్లూరి మరీ పార్టీని ప్రారంభించాడు. జనసేన పార్టీ కేవలం ప్రశ్నించడానికే అంటూ, ప్రజల్లోకి వెళ్ళాలని  భావించిన పవన్ ఆ పార్టీ ప్రారంభోత్సవాన్ని ఒక సభ ద్వారా హైద్రాబాద్ లో తెలియ జేశాడు. తర్వాత చాలాకాలం కామ్ గా ఉండి పోయాడు. ఇక ఎలాగూ  2014 ఎన్నికల్లో పోటీచేస్తాడు కదా అని అనుకుంటున్న జనానికి, అభిమానులకి షాక్ ఇస్తూ బిజెపికి, టిడిపికి మద్దతిచ్చి వారికి ప్రత్యక్షంగా సహాయం చేసాడు. మళ్ళీ కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు. అయితే టిడిపి ప్రభుత్వం రాజధానికి భూసేకరణ కాలంలో మళ్ళీ రైతులకి మద్దతుగా నిలబడ్డాడు. ఆ సమస్య తీరిందో లేక అలా గాలికి వదిలేశాడో గాని కామ్ గా కొన్నాళ్ళు ఉన్న పవన్, ఈ మద్య ప్రత్యేక హోదా విషయంపై తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తర్వాత కొన్నాళ్ళకి కాకినాడ వేదికగా సభ నిర్వహించగా అక్కడ అనుకోకుండా జనసేన కార్యకర్త ఒకరు చనిపోవడంతో పవన్ ఇక సభలు సమావేశాలు నిర్వహించనని ప్రకటించాడు. 

Advertisement
CJ Advs

అయితే సభల ద్వారా కాకుండా ప్రజల్లోకి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లడానికి పవన్ సోషల్ మీడియాని వేదిక చేసుకోవాలని అనుకున్నాడు. ఇక యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ల  ద్వారా జనాలకి దగ్గరకావడానికి జనసేనతో పవన్ సిద్ధమయ్యాడు. 2019 ఎన్నికల్లో ఎలాగూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. అందుకే ఇప్పటినుండే ప్రచారం  మొదలెట్టేశాడు. ఆ ప్రచారంలో భాగంగానే ఒక వీడియోతో సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఈ వీడియోలో జనసేన సిద్ధాంతాలు, వారు చెయ్యబోయే కార్యక్రమాల గురించి తెలియజేసారు. 

 

మరి ఇలాంటి వీడియోలను ఎన్ని తయారు చేస్తే జనంలోకి బాగా చొచ్చుకుపోతారో గాని ఇలా సోషల్ మీడియాని ప్రచారానికి వాడుకొని పవన్ ఒక విధంగా మంచి పనే చేసాడని చెప్పొచ్చు. అసలు  బహిరంగ సభల జోలికి వెళ్లకుండా జనాల్ని ఇబ్బందులు పెట్టకుండా నెమ్మదిగానైనా ఇలా ప్రచారం చెయ్యడం మంచిపనే. ఒక్క సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే సరిపోతుందా అనుకుంటే మాత్రం కష్టం. ఇక ఎలాగూ పవన్ ఒక సెలబ్రిటీ కాబట్టి సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి త్వరగానే చేరవచ్చు అని కూడా అంటున్నారు చాలామంది అభిమానులు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs