దేవిశ్రీప్రసాద్, తమన్‌ల దెబ్బకి మణిశర్మ సైతం తన స్దానాన్ని కోల్పోయాడు. ఇలాంటి సమయంలో కమల్‌హాసన్ వల్ల మంచి గుర్తింపు పొందిన యువ సంగీత సంచలనం గిబ్రాన్ 'విశ్వరూపం'తో పాటు 'రన్ రాజా రన్'తో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇక గిబ్రాన్ దూసుకెళ్లడం ఖాయమని, చిన్న, మధ్యతరగతి బడ్జెట్ చిత్రాలకు మంచి టాలెంటెడ్ టెక్నీషియన్‌గా ఎదగడం ఖాయమని మన పరిశ్రమ వర్గాలు కూడా సంబరపడిపోయాయి. కానీ ఆ తర్వాత కమల్ నుంచి వచ్చిన 'ఉత్తమవిలన్, చీకటిరాజ్యం' చిత్రాలు అందరినీ నిరాశపరిచాయి. సంగీతపరంగా కూడా ఈ చిత్రాలు ఆయనకు పెద్దమైనస్‌గా మారాయి. 'జిల్' చిత్రానిది కూడా అదే దోవ. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన 'బాబుబంగారం', తాజాగా వచ్చిన రామ్ 'హైపర్' చిత్రాలు చూసి ఆయన ఆర్‌ఆర్‌ను, పాటల ట్యూన్స్‌ను విన్నవారు గిబ్రాన్‌లో అప్పుడే సరుకు అయిపోయిందని, పాటల్లోనే కాదు.... బ్యాక్‌గ్రౌండ్ విషయంలో ఆయన తీవ్రంగా నిరాశపరచడంతో ఇప్పుడు ఆయన ఉనికిని కోల్పోయేలా కనిపిస్తున్నాడు. వన్ డే వండర్‌గా కనిపిస్తున్న గిబ్రాన్ అంటేనే ఇప్పుడు మన దర్శకనిర్మాతలు ఉసూరుమంటున్నారు.