Advertisement
Google Ads BL

మంచు లక్ష్మికి, ప్రభాస్ కి జక్కన్నే అడ్డు..!


నటి, నిర్మాత, గాయని, బుల్లితెర వయోక్త ఇలా కళా రంగంలో అనేకానేక కార్యాలు తలపెట్టి తోటి కళాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది మంచు మోహన్ బాబు తనయురాలు లక్ష్మి ప్రసన్న. బుల్లితెర పై ఎప్పటి నుంచో తన హవా నడుస్తున్నా ఈ మధ్య కాలం లో ఆవిడ నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమానికి వస్తున్న ఆదరణ వర్ణనాతీతం. ఎందరో వెండితెర తారలను సామాన్య జనుల మధ్యకు తీసుకు వెళ్లి ఎన్నో సామాజిక సమస్యల పై ప్రజలను చైతన్య వంతులను చెయ్యటానికి, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎన్నో స్వచ్చంధ సంస్థలకు చేయూత నిచ్చే సదావకాశం తారల ద్వారా జరిపిస్తుండటం ప్రేక్షకుల్లో మేము సైతం కార్యక్రమం పై ప్రత్యేక గౌరవం ఏర్పడేలా చేసాయి.

Advertisement
CJ Advs

ఇప్పటికే రానా దగ్గుబాటి, పోసాని క్రిష్ణ మురళి, సుమ కనకాల వంటి ప్రముఖులు ఎందరో వచ్చి వారి చేయూతను అందించారు. అయితే ఇప్పటికీ మంచు లక్ష్మి ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేకపోయింది అంట. బుజ్జిగాడు చిత్రంలో మోహన్ బాబుతో నటించినప్పటి నుంచి మంచు కుటుంబానికి ప్రభాస్ తో చెలిమి, చనువు ఉన్నాయి. కానీ ప్రభాస్ ని ఆహ్వానించక పోవటానికి లక్ష్మి కి రాజమౌళి అంటే ఉన్న భయమే కారణం అంట. బాహుబలి చిత్రీకరణలో ప్రభాస్ కి ఊపిరి తిప్పుకునే తీరిక ఇవ్వని జక్కన్న, ప్రభాస్ ని తన షో కోసం మంచు లక్ష్మి తీసుకువెళ్తే ఎంత ఆగ్రహానికి గురవుతారో తలచుకుంటేనే భయమేసి ఆగిపోతుంది అంట. ఈ విషయాలన్నీ లక్ష్మి స్వయంగా వెల్లడించింది.

మంచు మోహన్ బాబు ప్రభాస్ తో కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు చిత్రంలో నటించారు. అలానే రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ చిత్రంలో యముడి పాత్రలో కనిపించారు. మంచు కుటుంబంలో మరే నటులకు రాజమౌళి దగ్గర పని చేసే అవకాశం ఇంత వరకు రాలేదు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs