కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, సీనియర్ టాలీవుడ్ నటుడైన పోసాని కృష్ణమురళి మధ్య వాగ్వివాదం చెలరేగింది. చెలరేగటమే కాదండీ, భారత్ పాక్ యుద్ధంలాగా వారిరువురు మాటల తూటాలతో సై ...సయ్యా... అంటూ కొట్టుకోబోయారు కూడాను. ఓ టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అది కాస్తా నీవెంతంటే నీవెంత అనుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని లైవ్ కార్యక్రమంలో చర్చించుకునే సమయంలో ఇది చోటుచేసుకోవడంతో వీక్షకులకు అడ్డంగా దొరికిపోయారు. వినకూడని పదజాలాన్ని ఉపయోగిస్తూ తిట్టుకున్నారు.
భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ నిర్వహించిన విషయంపై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై పోసాని మాట్లాడుతూ బారత ప్రధాని నరేంద్ర మోడి నీతిమంతమైన పాలన చేస్తున్నాడని, భారత్ పరువు నిలబెట్టే గొప్ప వ్యక్తిగా మోడీని పొగుడుతున్నాడు. అయితే ఆ మాటలు విన్న వీహెచ్ ఒక్కసారిగా మీరు మోడీని పొగడదలచుకుంటే బయటకు వెళ్ళి పొగడండి, అంతేకానీ లైవ్ లో జరిగే చర్చాకార్యక్రమంలో అలా పొగడకండి అంటూ పోసానిని రెచ్చగొట్టాడు. అసలే కాకమీదున్న పోసాని నేనిక్కడే అందరూ వినేలా చెప్తే మీకేమన్నా అభ్యంతరమా.. అంటూ కుర్చీలోంచి లేచి మరీ అసభ్యకర పదజాలంతో వీరలెవల్లో వీహెచ్ పైకి దూకాడు. అంతలో వీహెచ్ అంతే స్వరాన్ని పెంచడంతో లైవ్ కట్ చేసేశారు.మొత్తానికి మన తెలుగు పెద్దలు ఎవరైనా చూసి నవ్వుకుంటారని కూడా లేకుండా అలా బహిరంగంగా చర్చావేదికల మీద గల్లీ మనుషులు వాడే పదజాలంతో తిట్టుకోవడం ఎంతైనా శోచనీయం. ఇంకా పోసాని మాట్లాడుతూ.. మోడి పాకిస్తాన్ వెళ్ళి నవాజ్ కుటుంబ సభ్యులకు చీర బహూకరించి భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటుంటే పాక్ మాత్రం తన బుద్ధి మార్చుకోకుండా దాడులకు తెగపడుతుందని ఆయన వివరించాడు. ఇంతలా మోడీ గురించి పోసాని పొగడటంతో వీహెచ్ కి మండుతున్నా నిగ్రహంతో మాటలకే పరిమితమయ్యాడు. కానీ పోసాని కుర్చీలోంచి ఉన్నపలంగా లేచేసరికి వీహెచ్ కూడా ఏం చేయలేక ఇక్కడ తగ్గితే పరువుపోతుందని లేచేశాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకొని ఉండి ఉండవచ్చు. అలా కాకపోయిన ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొని ఉండవచ్చు. అయితే పోసాని మాత్రం వీహెచ్ వ్యక్తీకరణ తీరును సహించలేకే అలా వ్యవహరించి ఉంటాడు కాబోలు.
Advertisement
CJ Advs