ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. భారత రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో పెను విప్లవాన్ని సృష్టించి రాజకీయంగానూ మంచి పరిపాలనా దక్షుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు కేజ్రివాల్. ప్రస్తుతం కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో గొంతుకలిపి సర్జికల్ స్ట్రైక్స్ పై సందేహాస్పదంగా మాట్లాడిన కేజ్రివాల్ జాతి వ్యతిరేక శక్తి అంటూ రామ్ గోపాల్ వర్మ మండిపడ్డాడు. భారత సైనికులు పాకిస్తాన్ సరిహద్దుల్లో చేసిన పోరాటానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడి భారత సైన్యం శక్తినే దెబ్బతిసేలా కేజ్రివాల్ వ్యవహరించాడు.
కాగా కేజ్రివాల్ పై వర్మ ఫైర్ అయిపోయాడు. మొదట బారత సైనికులు బయట దేశాలతోనే కాకుండా అంతర్గతంగా భారత్ లో కూడా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ వర్మ మండిపడ్డాడు. కేజ్రివాల్ ఎప్పుడూ నెత్తిమీద మఫ్లర్ పెట్టుకొని కోతిలా కనిపించే వాడు, ఇప్పుడు భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై మాట్లాడి నిజంగా ఆయన కోతి అయిపోయాడని వెల్లడించాడు. వర్మ ఎప్పుడూ అంతర్జాతీయవాదిలా ఉంటూ దేశం, దేశభక్తి వంటి వాటి పట్ల అంత మమకారాన్ని ప్రకటించడు. అలాంటి వ్యక్తిని కూడా కోపం తెప్పించాడంటే కేజ్రివాల్ బుల్లెట్ వర్మకు బాగా తగిలినట్టుంది. అందుకనే వర్మ, కేజ్రివాల్ పై ప్రతిదాడిలా మరో గట్టి బుల్లెట్ నే పేల్చేశాడు.
Advertisement
CJ Advs