Advertisement

కొత్త జిల్లాలు ఎవరికి ప్రయోజనమంటారు?


కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాల విభజనపై తొలి నుంచి ఓ అస్పష్టత కొనసాగుతుంది. ఏమిటో అదోర‌క‌మైన గంద‌ర‌గోళ పరిస్థితి వెల్లడౌతుంది. ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో అటు నాయకుల్లోనూ, ప్రజల్లోనూ భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకిలా జరుగుతుంది. అసలు కొత్తగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాలు ఎవరికి లబ్ధిని చేకూరుస్తాయి. తెలంగాణ సమాజానికా? తెలంగాణ రాజకీయ నాయకులకా? ఎవరి ప్రయోజనాలు ఆశించి అసలు కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయం నడుస్తుంది. ప్రధానంగా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అని పైకి నాయకులు వెల్లడిస్తున్నప్పటికీ అందులో స్వార్ధ  రాజకీయ నాయకులు చేస్తున్న జిమ్ములు మాత్రం మామూలుగా లేవు.  

Advertisement

తెలంగాణ రాష్ట్రం జిల్లాల విస్తరణలో భాగంగా మొదట 24 జిల్లాల‌ని ప్రకటించింది. ఆ తర్వాత అది కాస్త 27కు చేరింది. తాజాగా ఇప్పుడు 30 జిల్లాలు అని లెక్కకడుతుంది. ఇందులో కూడా ఏ క్షణంలోనైనా చేర్పులూ, మార్పులూ చోటు చేసుకోవచ్చంటుంది.  తొలుత జిల్లాలను ప్రకటించే ముందే శాస్త్రీయంగా లెక్కకట్టి మరీ ఈ జిల్లాలను రూపొందించాం. అంత ఆషామాషీగా తయారు చేసింది కాదంటూ ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే ఇంకా జిల్లాలను విభజించడంలోనూ, మ్యాప్ రూపొందించడంలోనూ తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు.

జిల్లాల విషయంలో కుమారుడు కేటీఆర్ ప్రతిపాదనను కూడా పక్కన బెట్టిన కేసీఆర్ ప్రజాకాంక్షను బట్టి కొత్త జిల్లాల సంఖ్యను పెంచుతామని కూడా అంటున్నారు.  ప్రజా సౌకర్యం కోసం, ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోస‌మే కొత్త జిల్లాలు అని మొదటి నుండి అదే పాట పాడుతున్న కేసీఆర్ గంటకొకసారి జిల్లాల లెక్కలు మార్చడం ఏంటి అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.  అసలు కేసీఆర్ కొత్త జిల్లాలను తనకు అనుకూలమైన రీతిలో ఏర్పాటు చేసుకుంటుండు, నిజంగా ఈయన పరిపాలన సౌలభ్యం కోసమా? రాజకీయ లబ్ధికోసమా? జిల్లాల ఏర్పాటు అంటూ అవాక్కవుతున్నారు జనం. ఇందులో పరిపాలన కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అర్ధమౌతుంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆశించే కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మారిన జిల్లాలను బట్టి చూస్తే కొన్ని నియోజ‌క వ‌ర్గాల ముఖ చిత్రాలే మారిపోతున్నాయి. దీంతో ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. ఒక్కో నియోజక వర్గం రెండు మూడు జిల్లాల పరిదిలోకి వెళ్తుండటంతో రాజకీయ నాయకులు కూడా అయోమయంతో కూడిన పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే కొత్త జిల్లాలు ఏర్పాటు  చేస్తూ అందుకు భవిష్యత్తులో తెరాస తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ప్రజలు కూడా వివరిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement