సినీరంగంలో కొన్ని అనుభవాలు చిత్రంగా కనిపిస్తాయి. ఇవి కాకతాళీయంగానే జరుగుతుంటాయి. జూ.ఎన్టీఆర్ తో ఫ్లాపు సినిమాలు తీసిన దర్శకులు ఆ తర్వాత హిట్ సినిమాలు చేస్తూ కెరిర్ కొనసాగిస్తున్నారు. స్టార్ హీరోతో కలిసి రాని అంశాలు ఇతర హీరోలతో దర్శకులకు కలిసివస్తున్నాయన్నమాట. తాజాగా హైపర్ సినిమా హిట్ తో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఫామ్ లోకి వచ్చాడు. కందిరీగతో దర్శకుడయ్యాక, వెంటనే ఎన్టీఆర్ తో రభస చేస్తే అదికాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి నిర్మాతను రోడ్డుపై నిలబెట్టింది. సంతోష్ కు హైపర్ అవకాశం రావడంతో బ్రేక్ వచ్చింది. ఇలాంటి అనుభవాలు ఇతరులకు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ తో ఊసరవెల్లి వంటి సూపర్ ఫ్లాప్ తీసిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత రేసుగుర్రం తీసి కోలుకున్నాడు. రామయ్యా వస్తావయ్యా వంటి ఫ్లాప్ తీసి గందరగోళంలో పడిన హరీష్ శంకర్ పుంజుకుని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసి సక్సెస్ చేసి గాడిలో పడ్డాడు. ఇప్పుడాయనకు అల్లు అర్జున్ తో దువ్వాడి జగన్నాథమ్ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ వంటి మాస్ హీరోతో సక్సెస్ లు ఇవ్వలేని వీరు ఆ తర్వాత హిట్ సినిమాలు చేయడం చిత్రంగా అనిపిస్తోంది. అలాగే మహేష్ బాబుతో 1 నేనొక్కడినే ఫ్లాప్ తీసిన సుకుమార్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో హిట్ తీసి తన ప్రతిభ చాటుకున్నారు.