కమిడియన్ గా టాలివుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొని తర్వాత హీరో అయ్యాడు సునీల్. అయితే ఇప్పుడు హీరో సునీల్ మరో అద్భుతమైన ఆఫర్ వచ్చిందంటూ ప్రకటించాడు. కమిడియన్ నుండి హీరోగా చేస్తున్న సునీల్ కు కొన్ని సినిమాలు విజయాలు అందించినా హీరోగా ముమ్మరంగా సినిమాల్లో అవకాశాలు రావడం లేదని కొన్ని సందర్భంలో తెగ బాధపడ్డాడు కూడాను. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సునీల్ కమిడియన్ గా ఉంటేనే బాగుండేది. అనవసరంగా హీరో అయ్యి అందులో అతకలేక నానా అవస్తపడుతున్నాడబ్బా అంటూ ఆవులించారు. కానీ తాజాగా వీరుపోట్ల దర్శకత్వంలో సునీల్ హీరోగా ఈడు గోల్డ్ ఎహే అంటూ రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే పరిశ్రమకు వచ్చిన మొదట్లో తమ పాత్ర ద్వారా పుట్టించే నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. అటువంటి నవ్వులను పంచే సునీల్ కు తగిన పాత్రను వెతుకులాడి మరీ దర్శకుడు అందాల రాముడు సినిమాను ఆయన్ని హీరోగా తీశాడు. అది హిట్టు కొట్టడంతో ఇక దర్శకులు సునీల్ ను తగిన పాత్రల్లో ప్రవేశపెడుతూ సముచితమైన హీరోగానే నిలబెట్టడానికి ప్రయత్నించి మొత్తానికి నవ్వించే నటుడిని కాస్త నవ్వుల హీరోని చేశారు. అయితే ఇప్పుడు ఈ నవ్వుల హీరోకి విలన్ గా నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఈ నవ్వుల హీరో సునీల్ స్పందిస్తూ 'విలన్ గా త్వరలో ఓ సినిమా చేస్తున్నాను. కానీ అది తెలుగులో మాత్రం చేయను. ఎందుకంటే నన్ను హీరోకంటే కమిడియన్ గానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నాకు తెలుసు. అటువంటప్పుడు ఇక్కడ నేను విలన్ గా మరింత డైల్యూట్ అయిపోతానేమోనని అనుమానంగా ఉంది' అంటూ వెల్లడించాడు. విలన్ అంటే సీరియస్ నెస్ ఉండాలి. సినిమాను నడిపించేది అసలు విలనే.. కాగా త్వరలో సునీల్ విలన్ అవతారం ఎత్తనున్నారన్నమాట.
Advertisement
CJ Advs