ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తమిళ 'వీరం' రీమేక్‌గా 'కాటమరాయుడు' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మాతగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 55రోజుల డేట్స్‌ను పవన్ కేటాంచాడు. ఈ చిత్రం తర్వాత పవన్.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యట్రిక్ మూవీ రూపొందనుంది. డిసెంబర్‌లోనే ముహూర్తం జరుపుకునే ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 100కోట్లకు పైగా ఖర్చుతో అంటే 'నాన్ బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టేయాలని త్రివిక్రమ్, రాదాకృష్ఱలు ఉన్నారు. కాగా 'జల్సా'తో కామెడీని, 'అత్తారింటికి దారేది' తో ప్యామిలీ ప్రేక్షకులను అలరించిన ఈ కాంబో మూడో చిత్రం మాత్రం ఓ పొలిటికల్ బేస్‌డ్ సినిమాగా రూపొందనుందని సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండానే పవన్ చిత్రం ఆయన పొలిటికల్ ఇమేజ్‌ను మైలేజ్‌ను పెంచేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినా చేయకపోయినా ఇదే టైటిల్ వర్కింగ్ టైటిల్ కావడం ఖాయం అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ ఈచిత్రం స్క్రిప్ట్ కోసం బిజీగా గడుపుతున్నాడు. వాస్తవానికి 'అ..ఆ'కు, పవన్ సినిమాకి మధ్య త్రివిక్రమ్ ఓ మీడియం రేంజ్ హీరోతో ఓ చిత్రం చేయాలనుకున్నాడు. దానికి గాను త్రివిక్రమ్‌కు 10కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా ఈ చిత్ర నిర్మాతలు ఆఫర్ చేశారు. కానీ పవన్ స్క్రిప్ట్‌కు మరింత శ్రద్దగా పని చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి త్రివిక్రమ్ నో చెప్పాడట. కాగా పవన్‌ను ఆయన అభిమానులే కాదు.. త్రివిక్రమ్ సైతం పవన్‌ని దేవుడిగానే కొలుస్తున్నాడు. సో.. ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అయితేనే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.