శృతి మించిన ప్రియాంక శృంగారం!


ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతపు అలవాట్లను కట్టుబట్లను అనుసరించాలి అనేది అత్యాధునిక  సూత్రం. కానీ ఆ సూత్రాన్ని కొంతవరకే భారతీయ సమాజం అంగీకరిస్తుంది. మంచి కోసం పద్ధతిగా ఏమైనా ఎలాంటి విషయాల్లోనైనా అడ్వాన్స్ అయిపోతే అంగీకరిస్తుంది భారతీయ సమాజం. కానీ ఒక్క శృంగారం విషయంలో మాత్రం శృతి మించిపోతుంటే ఒప్పుకోదు. అది మన సంస్కృతి కాదంటుంది. కానీ  మ‌న ప్రియాంక‌చోప్రా మాత్రం హాలీవుడ్ లో ప్రవేశించి ఆ నీరు బాగా వంటపట్టించుకొని ఆ అలవాట్లను వారి సంస్కృతిని చక్కా పాటిచ్చేస్తుంది. పాటించడం కూడా కాదు అందులో సంలీనమైపోతుంది. హాలీవుడ్‌లోకి వెళ్లిన ప్రియాంక అక్క‌డి వాతావ‌ర‌ణానికి బాగా అల‌వాటు ప‌డి పోయింది. శృంగార స‌న్నివేశాల్లో హాలీవుడ్ క‌థానాయిక‌ల‌కి ఏమాత్రం తీసిపోవ‌డం లేదు కదా అస్సలు తగ్గేదేలేదంటూ ఆచరణాత్మకంగా దులిపేస్తుంది.  

ప్రియాంక హాలీవుడ్ తెర‌పై చూసిన‌వాళ్ళెవరైనా ఈమె ప‌క్కా హాలీవుడ్ న‌టి అనుకొంటున్నారు. భార‌తీయ సినీ ప్రేక్ష‌కులు మాత్రం ప్రియాంక చేసిన ఘాటైన స‌న్నివేశాల్ని, హాటురేపుతున్న ముద్దు సీన్స్ లను చూస్తూ అమ్మ ప్రియాంక అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. ప్రియాంక ఇంతలా చేస్తుందా అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు. దొండ‌పండు వంటి పెదాలు గల ప్రియాంక‌ అమెరిక‌న్ టీవీ షో క్వాంటికోలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తొలి పార్ట్ సిరీస్ ఇప్ప‌టికే దిగ్విజయంగా  పూర్త‌యింది. మొదటిభాగంలోనే ప్రియాంక చోప్రా న‌ట‌నా విశ్వరూపాన్ని చూసిన భారతీయ ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక మొదటి దాంట్లోనే డోసు అలవాటు చేసి, రెండో భాగంలోని సిరీస్ లో భాగంగా ఆ డోస్ ను కాస్త మరింత పెంచింది. సుదీర్ఘంగా సాగే ఓ శృంగారానుభూతిని కలిగించే స‌న్నివేశంలో నటించింది. హాలీవుడ్ న‌టుడైతే అస్సలు పండుగ చేసుకున్నాడనుకో. ప్రియాంక సంలీనమైపోయి ముద్దుల మీద ముద్దులిచ్చినట్లు చేసిన ఆ సన్నివేశం చూసిన భారతీయ సమాజం ప్రియాంక శృంగారపరంగా శృతిమించిపోతుందంటున్నారు. ఇంకా ప్రియాంక హాలీవుడ్ ప్ర‌భావానికి లోనై అందులో కొట్టొచ్చినట్టుగా కనపరుస్తుందంటూ చెప్పేసుకుంటున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES