Advertisement
Google Ads BL

పవన్ నిజాయితీపరుడు కాదు..చెడ్డవాడు కాదు!


విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడే నటుడుగా పేరుపొందాడు పోసాని కృష్ణమురళి. ఏ విషయంపైనైనా తనకు నచ్చిన విషయం పట్ల, నచ్చని విషయాల పట్ల నిర్మొహమాటంగా వ్యవహరించడం ఆయన నైజం. ఈ విషయంలో ప్రస్తుత కాలమాన ప్రకారం టాలీవుడ్ లో పోసాని తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు. మాట పట్ల గీత దాటని మనస్తత్వం ఉన్న నటుడు పోసాని. వాటాలను పుచ్చుకొని మాటలను వ్యక్తపరచడం అంటే ఆయనకు చిరాకు.  అటువంటి నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఒక్కసారిగా ఆలోచనా పూరితమైన స్పందనను ప్రకటించాడు. అదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి అయ్యే సరికి ఆశ్చర్యమేస్తుంది.  

Advertisement
CJ Advs

చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడాడు. రాజకీయాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి చాలా నిజాయితీపరుడైన నటుడు అంటూ వెల్లడించాడు పోసాని. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుండి తాను పోటీ చేసేటప్పుడు తన  వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని, డబ్బులు తీసుకోకుండానే టికెట్ ఇచ్చారన్నాడు పోసాని. ఇంకా మాట్లాడుతూ చిరంజీవి ప్రజారాజ్యం పెడితే మళ్లీ ఆయన పార్టీలోకి వెళ్తానని వివరించాడు. ఇదే సందర్భాన్ని ఆశ్రయించుకొని పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించినప్పుడు... 'నేను ఎవరి గురించైనా మాట్లాడాలంటే అతడు నిజాయితీపరుడైనా అయ్యుండాలి. లేదా చెడ్డవాడైనా అయ్యుండాలి' అంటూ టకీమని అనాలోచితంగా చెప్పేశాడు పోసాని. ఈ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీని హిట్ చేశాయి. ఇటువంటి అనుమాన పూరిత మాటల్లో ఘాటు అర్థం ఉందంటూ చర్చలు మొదలయ్యాయి. ఏదీ కాకుండా మరి పవన్ తన అవసరాల కోసం ఎటు వీలైతే అటు వాలిపోయే నటుడా అంటూ చర్చోపచర్చలు నడుస్తున్నాయి. పవన్ కు స్వతంత్రమైన వ్యక్తిత్వం, నైతికమైన ఆలోచనలు, నిర్మాణాత్మకమైన సైద్ధాంతికమైన ధోరణి అనే పలు అంశాల పట్ల పవన్ కున్న పట్టు గురించి ముఖ్యంగా చర్చలు జరుగుతున్నాయి. కరిగిపోయే గుండెలా, చలించి పోయే హృదయంలా వ్యవస్థ పట్ల, సమాజం పట్ల పవన్ తీసుకొనే నిర్ణయాలు, చేసే ఆలోచనలు కూడా కరిగిపోయే మంచులాంటివేనా అంటూ ప్రజలకు కూడా ఆలోచనలను రేపుతున్నాయి పోసాని మాటలు. కాగా ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపైన, సినిమా జీవితంపైన ఈ స్థాయిలో ఇటువంటి ఘనమైన విలువైన విషయాలు వెల్లడించే వ్యక్తుల నుండి అనుమానాలను ఎవరూ వెలిబుచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs