'జనతా గ్యారేజ్' విడుదలై ఇప్పటికి ఒక నెల కావొస్తోంది. అయితే ఆ సక్సెస్ జోష్ లో వున్న ఎన్టీఆర్ ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చెయ్యాలా అనే దానిపై ఇంకా ఓ క్లారిటీ కి రాలేదు. ఒకసారి పూరి ఫిక్స్ అంటారు. మరోసారి వంశి వక్కంతం తో అంటున్నారు. అలాగే అనిల్ రావిపూడి. కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ మాత్రం ఏం చెప్పలేదు. అయితే ఇప్పుడు మరో రకం వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో ప్రచారంలో వుంది. అదేమిటంటే అన్న కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్ 'బ్రదర్స్' (బాక్సర్ అని కూడా వినిపిస్తుంది) మూవీలో నటిస్తున్నాడని టాక్ బయటికొచ్చింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఒకటే హల్ చల్ చేస్తుంది. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు... అసలెప్పడు ఈ సినిమా పట్టాలెక్కుతోంది... అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలి. ఇక ఇప్పుడు మరో వార్త బయటికొచ్చింది.
అదేమిటంటే 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపించాడని అంటున్నారు. ఇద్దరి మధ్యన చర్చ కూడా జరిగిందని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపాడని, ఇక వీరిద్దరి సినిమా దాదాపు ఫైనల్ అయ్యింది అని అనుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. కానీ త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడట. పవన్ తో సినిమా చెయ్యడానికి బలమైన కథని ప్రిపేర్ కూడా చేస్తున్నాడట. ఇప్పటికే పవన్ 'కాటమరాయుడు' సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడంతో... త్రివిక్రమ్ తో సినిమా 'కాటమరాయుడు' తర్వాతే ఉంటుందని సమాచారం. అయినా త్రివిక్రమ్ మాత్రం పవన్ కోసం వెయిట్ చెయ్యడానికే మొగ్గుచూపుతున్నాడని టాక్ బయటికి వచ్చింది. అంటే ఎన్టీఆర్ తో సినిమా పక్కన పెట్టేసి పవన్ తో తీసిన తర్వాతే ఎన్టీఆర్ తో కమిట్ అవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. మరి బహుశా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మాత్రం వచ్చే ఏడాది చివరిలో ఉంటుందేమో! ఈ విధంగా ఎన్టీఆర్ చేయబోయే తర్వాత సినిమా కోసం ఇంకెంత మంది డైరెక్టర్స్ పేర్లు లైన్ లోకొస్తాయో..!