ప్రకాష్ రాజ్ అంటే సినిమా ఇండస్ట్రీ లో అందరికి పరిచయమే. ఆయన ఒక పాత్రలో చేస్తున్నాడు అంటే అందులో నటిస్తున్నాడు అనేకంటే జీవిస్తాడనే చెప్పాలి. అలా ఒక తండ్రి పాత్రలో సెంటిమెంట్ చూపిస్తూనే.... విలన్ గా అతని క్రూరత్వాన్ని ప్రదర్శించేవాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా కూడా అందరిని మెప్పించిన ప్రకాష్ రాజ్ 'ఒంగోలు గిత్త' సినిమాలో ఒక మంచిమనిషి అనే ముసుగులో అతను విలన్ గా చేసే అకృత్యాలు ఎంతగా ప్రేక్షకులని మెప్పించాయో ఆ సినిమా చూసిన వారందరికీ అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ నటించి, నిర్మించి, దర్శకత్వం చేస్తున్న సినిమా 'మన ఊరి రామాయణం'. ఈ 'మన ఊరి రామాయణం' సినిమాలో.. 'ఒంగోలు గిత్త' సినిమాలో ప్రకాష్ రాజ్ వేసిన వేషం కంటిన్యూ చేస్తూ ఈ సినిమాని ప్రకాష్ రాజ్ తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. 'ఒంగోలు గిత్త' సినిమాలో మంచితనం అనే ముసుగు వేసుకుని రాముడిలా అందరి ముందు బిల్డప్ ఇస్తూ లోపల రావణ సురుడులా అన్ని అకృత్యాలు చేస్తూ ... బయటకి మంచి మనిషి అన్నట్లు కనిపిస్తాడు. ఆ రావణ సురుడి ముసుగులో ప్రకాష్ రాజ్ చేసే అకృత్యాలకు అడ్డు అదుపు ఉండదు. ఒక మనిషిలో ఎన్ని చెడు లక్షణాలు ఉండాలో ఎంత క్రూరత్వం ఉండాలో అన్ని 'ఒంగోలు గిత్త' లో ప్రకాష్ రాజ్ విలన్ గా చూపించాడు.
మరి ఇప్పుడు 'ఒంగోలు గిత్త' మూవీలోని అవతారం, అదే డ్రెస్సెన్స్ తో ప్రకాష్ రాజ్ 'మన ఊరి రామాయణ' లో నటిస్తున్నాడని ఆ సినిమా ట్రైలర్స్ చూసిన వారికి అర్ధమవుతుంది. అలాగే రీసెంట్ గా మన ఊరి రామాయణం ఆడియో విడుదలకి 'ఒంగోలు గిత్త' డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ రావడం కూడా ఇది అదే అనే అనుమానం కలిగిస్తుంది. 'మన ఊరి రామాయణం' అంటే ఇందులో రాముడి కి ఎంత పవర్ ఫుల్ పాత్ర ఉంటుందో రావణాసురుడికి కూడా అంతే పవర్ ఫుల్ పాత్ర ఉంటుంది. మరి ప్రకాష్ రాజ్ ఇందులో పైకి రాముడిగా కనిపిస్తూ...రావణాసురుడిగా ఇంకెంతగా రెచ్చిపోయాడో తెలియాలంటే..అక్టోబర్ 7 'మన ఊరి ఒంగోలు గిత్త'...కాదు కాదు 'మన ఊరి రామాయణం' మూవీ విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజుకి జోడిగా ప్రియమణి నటిస్తుంది.