Advertisement
Google Ads BL

వరస చిత్రాలను లైన్‌లో పెడుతున్న ప్రభాస్‌...!


'బాహుబలి' చిత్రం కోసం ఏకంగా మూడేళ్లు అమరేంద్ర బాహుబలి, శివన్నలకు కేటాయించిన యంగ్‌ రెబెల్‌స్టార్‌ నవంబర్‌ నెలతో 'బాహుబలి'కి గుడ్‌బై చెబుతున్నాడు. నవంబర్‌తో ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తికానుంది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ వరసగా తన చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నాడు. 'బాహుబలి - ది కన్‌క్లూజన్‌' చిత్రం షూటింగ్‌ పూర్తి కావడంతో ప్రభాస్‌ యువి క్రియేషన్స్‌ బేనర్‌లో సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం మొదలుపెట్టనున్నాడు. ఆ తర్వాత యువి క్రియేషన్స్‌లోనే ఆయన 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఇక తన మరో సొంతబేనర్‌ అయిన గోపీకృష్ణా బేనర్‌లో మరో చిత్రం చేయనున్నాడు. మొత్తానికి 'బాహుబలి' కోసం మూడేళ్లకు పైగా వెచ్చించిన ప్రభాస్‌ ఇప్పుడు ఆ క్రేజ్‌ను తన సొంత సంస్దలైన యువిక్రియేషన్స్‌, గోపీకృష్ణ బేనర్స్‌కు మాత్రమే దక్కేలా చర్యలు తీసుకుంటున్నాడు. మరి 'బాహుబలి'తో వచ్చిన ఇమేజ్‌ ఈ చిత్రంతో పాటు ప్రభాస్‌ నటించే ఇతర చిత్రాలకు కూడా అదే స్దాయిలో ఉంటుందో లేదో తేలాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs