Advertisement
Google Ads BL

అమ్మ ఆరోగ్యంపై సర్వత్రా అనుమానమే..?


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అసలేమైంది? అమ్మ ఆరోగ్యాన్ని ఆశ్రయించుకొని సామాజిక మాధ్య‌మాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతున్న రకరకాల కామెంట్లు, రూమర్లు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి? అనే విషయాలు తమిళనాడు అంతటా చక్కుర్లు కొడుతున్నాయి. అసలు అమ్మ ఆరోగ్యంగానే  ఉందా? అన్న విషయంలో ప్రజలకు రకరకాల ఊహాగానాలు వ్యక్తమై అనుమానాలను రేపుతున్నాయి. కేవలం అందులో భాగంగానే చెన్నై అపోలో ఆసుపత్రి పరసర ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గంటల తరబడి, రోజుల సమయం పడిగాపులు కాచుకొని ఉంటున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఆసుపత్రి వర్గాల నుండి ప్రకటన రాకపోవడంతో ఈ అనుమానానికి మరింత బలం చేకూరుతుంది.  అసలు అమ్మ ఆరోగ్యం వెన‌క అంత‌రార్థం ఏంటి? అసలు అంతర్గతంగా ఎలాంటి రహస్యాలు చోటుచేసుకుంటున్నాయి? ఇలాంటి ప్రశ్నలు తమిళనాట ప్రతి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీట‌న్నిటికీ స‌మాధానం రావాల్సి ఉంది.  

Advertisement
CJ Advs

ఏ ముఖ్యమంత్రి  అయినా అనారోగ్యానికి గురైతే సహజంగా ఆందోళన నెలకొంటుంది. కానీ ఇప్పటి పరిస్థితి, అపోలో పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పరిణామాలు,  గ‌త వారం రోజులుగా అక్కడ హైటెన్ష‌న్ ను క్రియేట్ చేస్తుంది. ఎవ‌రూ ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా అంతా అదో లోకంగా ఉంటూ హడావుడిగా తిరుగుతూ ఇప్పుడు ఆసుపత్రి పరిసరాల్లో జరుగుతున్న తంతు ఇది.  కాగా ఉన్నఫలంగా ఆసుపత్రి వర్గాలు కూడా అమ్మ ఆరోగ్యం గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో, జయలలిత ఆరోగ్యంగానే ఉన్నారంటూ త‌మిళ‌నాడు ఇన్‌ఛార్జ్ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావు ఓ ప్ర‌క‌ట‌న అంటూ చేశారు. కానీ ప్రస్తుతం ఆసుపత్రి చుట్టూతా నెలకొన్న పరిస్థుతులు, గంభీర వాతావరణాన్ని చూస్తే ఆ ప్రకటనను కూడా న‌మ్మ‌లేందిగానే పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యాసాగర్ రావు వెళ్లి జ‌య‌లలితను ప‌రామర్శించారని, లండ‌న్ వైద్యులు అత్యున్న‌త వైద్య పరీక్షలు చేస్తున్నారని ప్రకటించినప్పటికీ కూడా అమ్మ ఆరోగ్యం వెనుక ఏదో ఓ మిస్ట‌రీ దాగున్నదన్న విషయం.... జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది.  ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆధారం చేసుకొని ఆమె ఆరోగ్యంపై ఇంకా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా అసలు జయలలితకేమైంది? అంటూ తమిళనాడంతా గంభీర వాతావరణం నెలకొంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs