శ్రీను వైట్ల - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'మిస్టర్' సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా ఊటీ లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ లో వరుణ్ తేజ్ కాలికి గాయమైంది. శుక్రవారం ఉదయం ఒక సన్నివేశాన్ని తెరకెక్కించే క్రమంలో వరుణ్ కాలికి గాయమయిందట. గాయం తో బాధపడుతున్న వరుణ్ ని హాస్పిటల్ కి తరలించగా ఎముక కొంచెం చిట్లినట్లు వైద్యులు తెలిపారని... కొన్ని రోజులు రెస్ట్ లో ఉంటే సరిపోతుందని చెప్పారట. ఇక వరుణ్ మాత్రం హాస్పిటల్ నుండి నేరుగా షూటింగ్ స్పాట్ కి వచ్చి నొప్పిని భరిస్తూనే ఆ సన్నివేశాల్ని కంప్లీట్ చేసాడట. వరుణ్ కి... ఎంత డెడికేషన్ వర్క్ అంటే.... కాలు నెప్పితోనే షూటింగ్ చేసాడని అంటున్నారట యూనిట్ సభ్యులు.
ఇక వరుణ్ కి సంబంధించిన సన్నివేశాలు పూర్తవడం వలనో లేక కాలు దెబ్బ తగిలి రెస్ట్ కోసమో..షూటింగ్ నుండి వరుణ్ తేజ్ హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. ఆయనతో పాటు 'మిస్టర్' లో వరుణ్ కి జోడిగా నటిస్తున్న లావణ్య, మరో నటుడు రాజేష్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా వీరు ఒక ఫోటో కి ఫోజిచ్చారు. ఆ ఫోటోని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేసాడు. ఈ ఫొటోలో వరుణ్ ఒక వీల్ చైర్ లో కూర్చుని అతనికి సహాయం గా లావణ్య, రాజేష్ నిలబడ్డారు. ఇక ఈ ఫోటో కి క్యాప్షన్ గా మేము ముగ్గురు ఊపిరి సినిమాని ఇమిటేట్ చెయ్యడానికి ట్రై చేశామని పెట్టాడు. అంటే ఊపిరి సినిమాలో నాగార్జునకు కార్తి, తమన్నా లు హెల్ప్ చేసినట్లు ఇక్కడ లావణ్య, రాజేష్ లు తనకు హెల్ప్ చేశారని దానర్ధం. ఇక నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు మీ ఇద్దరికీ కృతఙ్ఞతలు అని చెప్పాడు.
మరి వరుణ్ కాలిని చూస్తుంటే దెబ్బ గట్టిగానే తగిలినట్టు కనబడుతుంది. కొన్ని రోజులు జాగ్రత్తగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ ఎలాగూ చెప్పారు కాబట్టి వరుణ్ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక రికవరీ అయ్యాక మళ్ళీ 'మిస్టర్' షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్ళిపోతాడని సమాచారం.