రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన గ్రేట్ డైరెక్టర్. ఆయన తీసిన 'బాహుబలి 1' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆయనవైపు తిప్పుకున్నాడు. మరి అలాంటి డైరెక్టర్ గత రాత్రి జరిగిన 'బాహుబలి 2' లోగో లాంచ్ ప్రెస్ మీట్ లో మీడియాకి క్షమాపణ చెప్పాడు. అదేమిటి అంత గ్రేట్ డైరెక్టర్ క్షమాపణ చెప్పడమేమిటి అనుకుంటున్నారా...! ఎందుకు మీడియాకి క్షమాపణ చెప్పాడంటే ఆయన ఆయన తన 'బాహుబలి 2' సినిమా హీరోలతో ప్రెస్ మీట్ ని పెట్టాలనుకుని మీడియా కి టైం సెట్ చేసి మరీ చెప్పాడు. ఇక మీడియా అనుకున్న టైం కి ప్రెస్ మీట్ జరిగే ప్రదేశానికి వెళ్ళింది. అసలే 'బాహుబలి 2' మొదలైనప్పటినుండి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రెస్ మీట్ గాని ఒక ఫస్ట్ లుక్ గాని బయటికి రాలేదు. అందుకే ప్రెస్ మీట్ అనగానే రెక్కలు కట్టుకుని అనుకున్న టైం కి వాలిపోయారు మీడియా మిత్రులు.
కానీ అనుకున్న టైం కి మాత్రం రాజమౌళి గాని హీరోలు ప్రభాస్, రానా లు గాని, నిర్మాతలు గాని హాజరవలేదు. ఇక మీడియా దాదాపు 2 గంటలు వెయిట్ చేస్తూనే వుంది. ఇక అప్పుడు రాజమౌళి అండ్ హీరోలు అక్కడికి వచ్చారు. రావడంతోనే ఒక్కొక్కరిగా మీడియాకి క్షమాపణ చెప్పి... మేము ఇంత లేట్ గా రావడానికి కారణం ట్రాఫిక్ జాం అని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని బయలుదేరి వస్తుంటే ట్రాఫిక్ లో చిక్కుకు పోయి ప్రెస్ మీట్ కి లేట్ గా వచ్చామని వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇక క్షమాపణ చెప్పి మరీ తమ కార్యక్రమాల్ని మొదలెట్టారు. మరి వాళ్ళ సంస్కారానికి హాట్స్ చెప్పాల్సిందే.
ఇక డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు అయన తీసిన సినిమాలన్నీ హిట్. ఇక 'బాహుబలి'తో ప్రపంచాన్ని టచ్ చేసి టాప్ డైరెక్టర్ గా వున్నాడు. అలాంటి డైరెక్టర్ క్షమాపణ చెప్పకపోయినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ రాజమౌళి మాత్రం తాను తన టీమ్ లేట్ గా వచ్చినందుకు సారీ చెప్పి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఇక ప్రభాస్, రానా కూడా తామెంత పెద్ద హీరో లైనా కూడా మీడియాకి సారీ చెప్పి వారు కూడా గ్రేట్ అనిపించుకున్నారు.
అసలు ఈ కాలం లో ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే అది సరైన టైం కి అసలు స్టార్ట్ అవదు. ఒకవేళ అయినా కూడా ఆయా హీరోలు చాలా లేట్ గా, ఆర్చుకుని, తీర్చుకుని వస్తారు. వచ్చినా తమ తమ పనుల్లో బిజీ అయిపోయి మీడియా ని అసలు పట్టించుకోరు. ఇలాంటి ఘటనలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలానే జరిగాయి. చిన్న సినిమా వాళ్లు అయితే మరీను ఇలా సారీ లు గట్రా ఏం చెప్పరు కూడా. తాజా సంఘటనతో మరి ఇప్పటకైనా రాజమౌళి ని చూసి అందరూ ఎంతో కొంత నేర్చుకోవాలనే కామెంట్స్ వినబడుతున్నాయి.