దర్శక ధీరుడు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రాతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి 2. బాహుబలి-2 లోగోను ఆవిష్కరించిన రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, రానాలతో కలిసి విలేకరులతో మాట్లాడాడు. రాజమౌళి మాట్లాడుతూ... ప్రత్యేకంగా అక్టోబర్ 5వ తేదీన ప్రభాస్ అభిమానులకు సర్ ప్రైజ్ లో ముంచి తేల్చే విషయాన్ని ప్రకటించబోతున్నాం అంటూ అదేంటో చెప్పకుండా ఆసక్తిని రేకెత్తించాడు. అక్టోబర్ 5వ తేదీనే ఆ గుడ్ న్యూస్ ప్రకటిస్తామని చెప్పి అభిమానుల్లో క్యూరియాసిటినీ పెంచారు రాజమౌళి. అదీ ప్రభాస్ పెళ్ళి విషయం మాత్రం కాదని, బాహుబలి పూర్తయ్యే వరకు ప్రభాస్ పెళ్ళి చేసుకోనని మాటిచ్చాడని, ఇంకా ప్రభాస్ తర్వాత సినిమా విషయం కూడా కాదని విషయం పట్ల ఉత్కంఠతను రేకెత్తించాడు రాజమౌళి. అయితే అక్టోబర్ 22 వ తేదీన బాహుబలి2 ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నామని, ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని 23వ తేదీనాడు బాహుబలి2 వర్చువల్ రియాలిటీ మేకింగ్ వీడియోస్ విడుదల చేయనున్నట్లు ఆయన వివరించాడు. సినిమా విడుదల నెల ముందే బాహుబలి వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ కూడా విడుదల చేస్తామని, అందులో సినిమా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపాడు. సినిమా పరంగా ఇంకా రెండు పాటలు, కొన్ని యాక్షన్ సీన్స్ మినహా సినిమా అంతా పూర్తయినట్లుగా, మిగిలింది అక్టోబర్, నవంబర్ లో షూట్ చేసి డిసెంబర్ కి సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపాడు. కాగా అక్టోబర్ 5 వ తేదీన ఏం వెల్లడించనున్నారని విలేకరులు గుచ్చి గుచ్చి అడుగినా రాజమౌళి ఏమాత్రం క్లూ కూడా ఇవ్వకుండా ఆరోజే సర్ ప్రైజ్ చేస్తామంటూ వివరించాడు. విలేకరుల సమావేశం ఆలస్యంగా ప్రారంభించినందుకు సారి చెప్పాడు రాజమౌళి. కాగా బాహుబలి2 రిలేజయ్యేంత వరకు బాహుబాలి వివరాలు ఏమాత్రం వెల్లడించమని దర్శకుడు రాజమౌళి వెల్లడించాడు.
ప్రభాస్ మాట్లాడుతూ.. బాహుబలి చిత్రం చాలా అద్భుతంగా వస్తుందని, బాహుబలి కామిక్ బుక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. అక్టోబర్ 22వ తేదీ బాహుబలి కామిక్ సిరీస్ పుస్తకాలు విడుదల చేస్తామని ప్రభాస్ తెలిపాడు.
రానా మాట్లాడుతూ హైక్వాలిటీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపాడు.
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ జనవరిలో బాహుబలి2 ట్రైలర్ విడుదల చేస్తామని, ఏప్రియల్ 28, 2017న బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెప్పాడు.