ఇండస్ట్రీలో వరస హిట్టులు ఉన్నప్పుడే కాస్త తలవంచి పనిచేయాలి. కానీ మొండిగా ప్రవర్తిస్తే ప్రస్తుతానికి హిట్స్ వచ్చేటప్పుడు ఎవరు కాదన్నా నడిచే బండి ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు ఆ వ్యతిరేక శక్తులన్నీ పనిచేస్తాయి. కాగా 'బెంగాల్ టైగర్' తర్వాత ఇప్పటివరకు రవితేజ మరలా ముఖానికి మేకప్ వేయలేదు. హిట్స్‌లో ఉన్నప్పుడు ఎవర్ని పట్టించుకోని ఆయన పతనం వెనక కొన్ని శక్తులు తెరవెనుక కధలు ఆరంభించాయి. దిల్‌రాజు 'ఎవడోఒకడు' అనే చిత్రం చేస్తానని చెప్పి, తర్వాత నో.. నో.. అన్నాడు. ఇక దానయ్య నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో రవితేజ నటించాల్సిన చిత్రం దానయ్యకు మహేష్‌బాబు కాల్షీట్స్ దొరకడంతో దానయ్య.. రవితేజ చిత్రాన్ని పక్కనపెట్టాడు. మరో అగ్రనిర్మాత కూడా చక్రి అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ 'రాబిన్‌హుడ్' కు ముందుకు వచ్చినప్పటీకీ రవితేజ ఓవర్‌యాక్షన్ వల్లే ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. కాగా ఎట్టకేలకు బాబి దర్శతక్వంలో రవితేజ నటించే కొత్త చిత్రం అక్టోబర్ 12న పట్టాలెక్కనుంది. మొత్తానికి రవితేజ కెరీర్‌కు ముగ్గురు నిర్మాతలు విలన్లలా తయారైనారని ఇండస్ట్రీలో చెబుతున్నారు.