Advertisement
Google Ads BL

చైతూతో సమంత ది రెండో పెళ్ళా..!!


ఒక హీరోయిన్ ప్రేమ, పెళ్లి కి సంబందించి విషయం లో మీడియా లో పలు రకాల వార్తలు రావడం సహజం. కానీ నాగ చైతన్య - సమంతల గురించి రోజుకో న్యూస్ హైలెట్ అవుతూ అందరి నోళ్ళలో నానుతుంది. అసలు గత కొంత కాలం గా ఆ రూమర్స్ తోనే నాగ చైతన్య - సమంత తెగ నలిగిపోతున్నారు. అవి రూమర్స్ అంటూనే నిజమనే సంకేతాలు ఇచ్చేసారు వీరు. కానీ ఇప్పటికీ అటు నాగార్జున కానీ, నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఎవ్వరు కూడా సమంత - నాగ చైతన్యల పెళ్లి గురుంచి కన్ఫర్మ్ చెయ్యలేదు. కానీ వీళ్ళ పెళ్లి ఖచ్చితం గా జరుగుతుందని మాత్రం మీడియా బల్లగుద్ది చెబుతుంది. అయితే ఇప్పుడు తాజాగా సమంత గురించి ఒక న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది.

Advertisement
CJ Advs

సమంతకి ఇదివరకే పెళ్ళై పోయిందనేది ఈ వార్త సారాంశం. సమంత అప్పుడెప్పుడో  ఒక హీరో ని సీక్రెట్  గా పెళ్లాడిందనే వార్త గుప్పుమంది. సమంత గతం లో సిద్ధార్థ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లా ఎక్కడ బడితే అక్కడ కనిపించేవారు. ఇక వీరిద్దరూ కలిసి శ్రీ కాళహస్తి గుడిలో దోష నివారణ పూజలు కూడా నిర్వహించారు. అయితే వీరిద్దరూ ఎవ్వరికి తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారట. కనీసం తల్లి తండ్రులకి కూడా తెలియనివ్వకుండా వీరిద్దరూ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని ప్రచారం మొదలైంది. అయితే వీళ్లిద్దరికీ సరిపడక పెళ్ళైన కొద్దీ రోజులకే విడిపోయారట. అందుకేనేమో సమంత కొంత కాలం ఎవరికీ కనబడకుండా పోయింది. ఇక వీరి పెళ్లి బ్రేకప్ అయ్యాక సమంత చాలా కుంగిపోయిందని... డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అందరికి దూరంగా కొన్ని రోజులు గడిపిందని అంటున్నారు. ఇక చాలా కాలం నుండి సిద్ధార్థ - సమంత ఇద్దరూ మాట్లాడుకోవడం కానీ... అసలు కలవడం కూడా లేదట. అందుకే ఇప్పుడు ఈ వార్తలకు ఆ గాసిప్స్ బాగా బలాన్నిచ్చాయి. 

ఇక డిప్రెషన్ నుండి బయట పడ్డాక తన సినిమాల్లో బిజీ అయిపోయింది. మరో పక్క సిద్దార్థ కూడా తన పనుల్లో బిజీ అయిపోయి కామ్ అయ్యాడు. ఇక తర్వాత సమంత - నాగ చైతన్యకి దగ్గరై బాగా రికవరీ అయ్యిందని టాక్ మొదలైంది. అయితే తన గతం గురుంచి సమంత, నాగ చైతన్య కి అంతా చెప్పిందని.... ఏ విషయం దాయకుండా నిజాయితీగా ఉందని అంటున్నారు. కానీ మిగతా అక్కినేని ఫ్యామిలి కి ఈ విషయం తెలియదని అంటున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సమంత మొదటి పెళ్లి గురించి తెలిసాక నాగ్  ఎలా రియాక్ట్ అవుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs