Advertisement
Google Ads BL

అభిమాని అడిగితే బాలయ్య కాదంటాడా!


తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న హీరో నందమూరి బాలకృష్ణ, ఎంత క్లిష్టమైన, ఎంతటి కఠినమైన డైలాగులనైనా అలవోకగా చేప్పేస్తారు. కాగా బాలకృష్ణ ఈ విషయంలో తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న వాటిల్లో ఇది ఒకటి. ఈతరం హీరోలలో ఎవ్వరికీ ఈ టాలెంట్‌ ఆస్దాయిలో లేదు. కాగా ఇటీవల ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు తన ట్యాబ్‌లో 'మాయాబజార్‌' చిత్రం చూస్తున్నాడు. అదే విమానంలో బాలయ్య కూడా ఉన్నాడని తెలుసుకున్న ఆ ప్రయాణికుడు బాలయ్య పక్కకు చేరి తను నందమూరి ఎన్టీఆర్‌కు వీరాభిమానినని, ఆయన నటించిన క్లాసిక్‌ చిత్రాలంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. అంతే కాదు.. 'దాన వీర శూర కర్ణ' చిత్రంలోని ఓ డైలాగ్‌ను చెప్పాల్సిందిగా ఆయన బాలయ్యకు కోరారు. అభిమాని అంతగా ముచ్చటపడుతుంటే కాదనలేని బాలయ్య ట్యాబ్‌ను చేతుల్లోకి తీసుకొని అందులోని డైలాగ్‌ను అవలీలగా చెప్పేశాడట. ఈ మొత్తాన్ని వీడియో తీసిన ఆ అభిమాని దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs