తమిళంలో పెద్ద హిట్ అయిన 'తని ఓరువన్' రీమేక్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్స్ పతాకంపై రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్, అరవింద్‌స్వామి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న 'ధృవ' చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. కాగా ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు వస్తే అందులో నటించిన హీరో జయం రవిని విలన్ పాత్ర చేసిన అరవింద్‌స్వామి డామినేట్ చేశాడు. స్వామి అద్బుతంగా నటించడంతో పాటు ఆయన పాత్ర సినిమాకు కీలకంగా రూపొందడంతో హీరోని విలన్ డామినేట్ చేశాడు. మరి తెలుగు వెర్షన్‌లో స్టార్‌డమ్ ఉన్న రామ్‌చరణ్ హీరోగా నటిస్తుండగా అరవింంద్‌స్వామి కూడా ఇదే రీమేక్‌లో నటిస్తుండటంతో ఇప్పుడు చరణ్, స్వామిల వార్ వెండితెరపై ఎలా చూపిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఉన్నది ఉన్నట్లుగా ఒరిజినల్ వెర్షన్ ఎలా ఉంటే అలాగే రీమేక్ చేస్తే అరవింద్ స్వామి పాత్రే కీలకంగా మారి రామ్‌చరణ్ ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అదే ఒరిజినల్ వెర్షన్‌లో తెలుగుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తే ఒరిజనల్‌లోని ఫీల్ మిస్సయ్యే అవకాశం ఉంది. మరి ఈ రెండు మార్గాల్లో దర్శకనిర్మాతలతో పాటు రామ్‌చరణ్ ఎలాంటి ప్లాన్‌ను అమలు చేయనున్నారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఏమి చేసినా సురేందర్‌రెడ్డి, అల్లుఅరవింద్‌తో పాటు రామ్‌చరణ్‌కు కూడా ఇందులో అవగాహన ఉందని, అందుకే వారు తీసుకోబోయే ఎత్తుగడ ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది.