సూర్య సింగం సీరీస్ తో హిట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే 'సింగం 1' మరియు 'సింగం 2' తో అటు తమిళం లోను ఇటు తెలుగులోనూ సూపర్ హిట్స్ కొట్టి ఇప్పుడు 'సింగం త్రీ' అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా సూర్యకు ఈ 'సింగం' సీరీస్ లో వచ్చిన సినిమాలు తప్ప ఇంకే సినిమాలు తెలుగు, తమిళంలో పెద్దగా అతనికి మంచి పేరు తీసుకురాలేకపోయాయి. రీసెంటుగా వచ్చిన '24' చిత్రం అటు తమిళ్ లో పెద్దగా ఆడకపోయినా ఇటు తెలుగులో పర్వాలేదనిపించింది. అందుకే సూర్య 'సింగం త్రీ' తో ఎలాగైనా హిట్ కొట్టాలని బాగా కృషి చేస్తున్నాడు. ఇక సూర్య ఈ 'సింగం త్రీ' ని తెలుగులోనే ఎక్కువ శాతం చిత్రీకరిస్తున్నాడట. ఎందుకంటే సూర్య కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడంతో సూర్య ఇలా ప్లాన్ చేసి తెలుగు ప్రేక్షకుల కు మరింత దగ్గరవడానికి అలా చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే వైజాగ్ వంటి పరిసర ప్రాంతాలలో కొంత షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు గుంటూరు - తలకోన అడవుల్లో మరికొంత షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే అక్కడ వర్షాలు పడుతుండడం తో తెలివిగా ఆ వర్షాన్ని కూడా సింగం త్రీ యూనిట్ క్యాష్ చేసుకుని యాక్షన్ ఎపిసోడ్స్ ని ఆ వర్షం లోనే తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ చిత్రం లో సూర్యకి జోడిగా అనుష్క, శృతి హాసన్ నటిస్తుండగా ఒక గెస్ట్ రోల్ లో ప్రభాస్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ ప్రభాస్ కనుక గెస్ట్ రోల్ చేస్తే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే 'బాహుబలి 1' తో తమిళ ప్రేక్షకులకి దగ్గరైయ్యాడు. ఈ 'సింగం త్రీ' లో అతన్ని నటింపచేస్తే తమిళ్ కే కాదు ఇటు తెలుగు లో కూడా 'సింగం త్రీ' కి ప్లస్ అవుతుందని భావించి చిత్ర యూనిట్ ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారని అంటున్నారు. అయితే ప్రభాస్ నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఒకవేళ వస్తే మాత్రం 'సింగం త్రీ' టైటిల్ ఇంకోలా వినపడటం ఖాయం.