నిజజీవితంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల జీవితాలను ఆధారంగా చేసుకొని చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు రాంగోపాల్‌వర్మ సిద్దహస్తున్నాడు. ఇప్పటికే వంగవీటి చిత్రాన్ని తీస్తున్న వర్మ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవిత గాధ ఆధారంగా సినిమా తీయడానికి సిద్దమవుతున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం ముంబై జైలులో శిక్ష అనుభవిస్తున్న నయిం అనుచరులను కూడా వర్మ కలిసి వారి నుండి నయీమ్ గురించి కొన్ని షాకింగ్ వివరాలు సేకరించాడని సమాచారం. ఇక ఆయన నయీం నక్సలైట్‌గా ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితులైన నక్సలైట్లను కూడా వర్మ కలిసి నయిం గురించి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాడట. కాగా ఈ పరిశోధనలో వర్మ.. నయీం గ్యాంగ్ గురించి మరికొన్ని షాకింగ్ న్యూస్‌లు కూడా తెలుసుకున్నాడట. కాగా ఇప్పటికే నయీం అనుచరుల నుండి వర్మకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయట. మొత్తానికి అనుకున్నది తీసి 'పారేయడం'లో వర్మకు సాటిరారు మరెవ్వరు అని చెప్పాల్సిందే.