బాలీవుడ్లో అలనాటి స్టార్ హీరోయిన్ రేఖ అందరికి తెలుసు. ఆమె సినిమా జీవితంలో ఎంత వెలుగు వెలిగిందో తన పర్సనల్ లైఫ్ లో అంతే బాధలు భరించింది. ఆమె స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు అమితాబ్ బచ్చన్ తో ప్రేమలో పడి..... ప్రేమికులుగా చట్టాపట్టాలేసుకుని తిరిగి చివరికి పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది. ఇప్పటికీ అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ నుండి వ్యతిరేఖత ఎదుర్కొంటూనే వుంది. అయితే ఇప్పుడు రేఖ గురించి ప్రత్యేకం గా ఎందుకు మాట్లాడుకోవలసి వస్తుందంటే ఆమె అనుభవించిన జీవితం గురించి..... ఆమె ఆత్మ కథ గా 'రేఖ... ద అన్ టోల్డ్ స్టోరీ' అనే పుస్తకం బయటికి వచ్చింది. రేఖ ఆత్మ కథని యాసిర్ ఉస్మాన్ అనే అతను వ్రాసాడు.
అసలు రేఖ గురించి బయట ప్రపంచానికి తెలియని సంగతులు చాలా ఈ పుస్తకం లో వున్నాయట. ఆమె పెళ్లి - ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలు చాలానే ఇందులో వున్నాయట. రేఖ అమితాబ్ తో ప్రేమ తర్వాత వినోద్ మెహ్రాను పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టడానికి... ఆనందం తో పెళ్లి దండలతో వెళ్లిందట. అయితే అక్కడ మాత్రం రేఖ అనుకున్నట్టు జరగకుండా వినోద్ మెహ్రా తల్లి రేఖని తన కొడుకుని చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి దండలతో ఇంటికి వచ్చిన కోడలిని నానా రకాల తిట్లతో దూషించిందట. అయితే రేఖ ఆమెను అడ్డుకోవడం తో చివరికి రేఖని చెప్పుతో కూడా కొట్టిందని ఈ పుస్తకం లో ఉస్మాన్ రాసాడట. అయితే ఇదంతా జరుగుతున్నా రేఖ భర్త వినోద్ మాత్రం అలా బొమ్మలా నుంచుని చూస్తూ ఉండిపోయాడట. పాపం మంగళ హారతులతో ఇంట్లో అడుగు పెడదామనుకున్న ఆమెకు చెప్పు దెబ్బె చివరికి మిగిలింది. అయితే ఈ విషయాలేమి రేఖ ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పనే లేదట. ఇక పెళ్లి విషయాలే కాకుండా అటు ప్రేమ వ్యవహారాన్నికూడా ఈ పుస్తకం లో వివరం గా చెప్పాడట. అమితాబ్ తో రేఖ నడిపిన ప్రేమాయణం దగ్గర నుండి ఆమె ఎదుర్కున్న ఇబ్బందుల వరకు ఈ పుస్తకం లో ఉస్మాన్ కళ్ళకు కట్టినట్లు చూపించాడట.