ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ అత్యాచారం కేసులో ఇరుక్కొని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇది నడుస్తూ ఉండగానే ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ విచారణకు రానున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆశారాం బాపూజీకి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు తెలిపింది. దాంతో ఆశారాం బాపూజీని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా వైద్య పరీక్షలు నిమిత్తం హాస్పిటల్ కు వెళ్ళిన ఆశారాం బాపూజీ ఓ నర్సుపై నోరు పారేసుకున్నాడు. ఆసుపత్రి లో ఓ నర్సును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఓ నర్సుని దగ్గరకు పిలిచి 'నీబుగ్గలు కాశ్మీర్ ఆపిల్స్ లా ఉన్నాయి' అంటూ సంచలనం రేపే వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఊరుకోకుండా ఇంకా తనకు కోరికలు తీరలేదని, ఈ దేహాన్ని మార్చి యువకుడిని చేసేలా తనకు మంచి చికిత్స చేయాలని వెల్లడించి అక్కడి వారందరినీ విస్మయానికి గురిచేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతూ పెద్ద దుమారానికి దారితీస్తున్నాయి. జనాలు అయితే ఈయనకు జైలుకు వెళ్ళినా బుద్ధి రాలేదంటూ ఆగ్రహంతో మండిపడుతున్నారు.