జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి గొప్ప రాజకీయ సలహా ఇచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు సంచలనానికి దారితీస్తున్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని కోరుకుంటే పవన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జగన్ తో కలిసిపోవాలని ఉండవల్లి సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఇలా ఎన్ని మీటింగ్ లు పెట్టినా ఎంతలా వీధి ఫైట్లు చేసినా ప్రత్యేక హోదా ఇక రానేరాదని... అది గమనించి తీరాల్సిన విషయం అని ఆయన అన్నాడు. పవన్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జగన్, కమ్యూనిస్టులతో కలిసి తెదేపాపై పోటీ చేస్తే ఆంధ్రా ప్రాంతం బాగుపడుతుందని ఆయన అన్నాడు.
రాష్ట్రానికి మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్, జగన్ కమ్యూనిస్టులు అంతా కలసి తెదేపా, భాజపాలపై పోటీ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు. ఉండవల్లి ప్రతిపాదనకు భిన్నంగా రాజకీయ విశ్లేషకులు భావన కొనసాగుతుంది. ఉండవల్లి సంచలన సలహాలు విశ్లేషకులకు హాట్ టాపిక్ గా మారాయి. అసలు పవన్ కళ్యాణ్ జగన్ తో కలవడం సాధ్యపడే అంశమేనా అనేది విశ్లేషకుల వాదన. కానీ కమ్యూనిస్టుల తో పవన్ కలవడం మాత్రం ఇప్పట్లో సాధ్యపడక పోయినా భవిష్యత్తులో సాధ్యపడే అంశమే అని అంటున్నారు. ఎందుకంటే పవన్ కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తే . కానీ పవన్ కళ్యాణ్, జగన్ లు కలవాలనుకోవడం మాత్రం ఉండవల్లి అత్యాశలో భాగమే అని రాజకీయ వర్గాల భావన. చూద్దాం ఏం జరుగుతుందో....