ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, నేతలను తన మాటలతో శాసిస్తుంటాడు. బాబు అంటే అందుకనే అందరికీ భయం. అసలు ఆయన 2004లో తిరిగి అధికారంలోకి రాకపోవడానికి ప్రభుత్వాధికారులే కారణం అని కూడా అంటుంటారు. ఆయనంటే వారికి భయం. ఇప్పుడు కాస్త తగ్గారు గానీ గతంలో అధికారం చెలాయించేప్పుడు ప్రభుత్వాధికారులను, మంత్రులను ఉరకలు పరుగులతో పని చేయించేవాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారంటే ఆయనకు సుతరామూ ఇష్టం ఉండదు. చెప్పిన పనిని చేయకపోతే శివాలెత్తిపోవడం ఆయన నైజం. అది బాబుగారి ప్రత్యేకత.
ఈ విషయం ఎంతటివారైనా చివరికి ఇంట్లో మనిషైనా వదిలిపెట్టడు. చివరికి సొంత కుమారుడిని కూడా అస్సలు విడిచిపెట్టడు. ఇలాంటి సందర్భమే ఇప్పుడు చోటు చేసుకుంది. తెదేపా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో లోకేష్ ఇదివరకటిలా పాల్గొనడం లేదని, బాబు మంత్రివర్గం ముందు ప్రస్తావించి మీరంతా లోకేష్ ను ఏం చేస్తున్నారంటూ మండిపడినట్లుగా తెలుస్తుంది.
ఈ మధ్య పార్టీ నేతలకు సమీక్ష నిర్వహించిన తర్వాత బాబు లోకేష్ గురించి ఇలా చెలరేగి పోయాడేంటి అంటూ మంత్రులంతా చెవుల్లో గుసగుసలాడుకున్నారు. వెంటనే లోకేష్ పార్టీపై తన తీరును మార్చుకోవాలని, పార్టీ కార్యకలాపాల పట్ల చురుకుగా పాల్గొనాలని ఆయన వెల్లడించినట్లు తెలుస్తుంది.
అసలే మున్సిపల్ ఎన్నికల్ ఘంటారావం మోగటంతో పార్టీపట్ల లోకేష్ ఎలాంటి ఏమరపాటు తనంతో ఉండకూడదని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సందర్బంలో విషయం ప్రత్యక్షంగా మంత్రుల వద్దే ప్రస్తావించడంతో ఇక లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశపెట్టే మార్గాన్ని సుమగం చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తీకరణల కారణంగా మంత్రుల మనస్సు తాలూకూ చింతన కూడా వెల్లడౌతున్నదన్నది బాబు లోగుట్టు.