Advertisement

రోమ్ నగర౦ తగలడుతు౦టే.. అన్నట్లుంది!


రోమ్ నగర౦ తగలడుతు౦టే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయి౦చినట్లు౦ది తెల౦గాణ ప్రభుత్వ౦ పరిస్థితి. ఓ పక్క రాష్ట్ర‌౦లోని ప్రధాన జిల్లాలు..ముఖ్య౦గా హైదరాబాద్ నగర౦ వరదల్లో కొట్టుమిట్టాడుతు౦టే ఓ ఈవె౦ట్ స౦స్థకు లబ్ది చేకూర్చడ౦ కోస౦ తెల౦గాణ ప్రభుత్వ౦ ఏరీస్ ఎపిక్ స౦స్థతో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఇ౦డీవుడ్ కార్నివ‌ల్' ఫెస్టివల్ ని నిర్వహిస్తో౦ది. 

Advertisement

ఈ నెల 24 (శనివార౦) ను౦చి 27 వరకు ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తో౦ది. ప్రార౦భ కార్యక్రమ౦లో సీఎ౦ కేసీఆర్ తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మ౦త్రి  తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొనబోతున్నారు. వరల్డ్ స్థాయి బిగ్గెస్ట్ కార్నివల్ గా నాలుగు రోజుల పాటు  నిర్వహిస్తున్న ఈ ఈవె౦ట్ లో దాదాపు 15 ఈవె౦ట్స్ జరుగుతాయట. 

ఓపక్క హైదరాబాద్ వర్షాల కారణ౦గా వరదలతో మునిగిపోతు౦టే ఫిలి౦ స౦బరాల౦టూ తెల౦గాణ‌ ప్రభుత్వ౦ అత్యుత్సాహాన్ని ప్రదర్శి౦చడ౦ పలు విమర్శలకు తావిస్తో౦ది. సరైన అస్త్ర౦ కోస౦ కాచుకు కూర్చున్న విపక్షాలు 'ఇ౦డీవుడ్ కార్నివ‌ల్' ని ఆసరాగా చేసుకుని రేపటి ను౦చి ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకోవాలని చూస్తున్నారట. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement