Advertisement
Google Ads BL

నిత్యామీనన్ కూడా నేర్చుకుంది!


నిత్యామీనన్ అంటే అందరికి పరిచయమే. ఆమె తన అందం, అభినయంతో అందరిని ఇట్టే ఆకట్టేసుకుంటుంది. ఆమె తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమెను అలనాటి సావిత్రి తో పోల్చారంటే ఆమె ప్రతిభ ఎంతపాటిదో తెలుసుకోవచ్చు. అంత పేరున్న నిత్యా మీనన్ కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకుందని ప్రచారం జరుగుతుంది. అవేమిటంటే ఒకటి వచ్చిన పాత్ర అల్లా ఒప్పేసుకోవడం ఇక రెండోది అందాల ఆరబోతకు రెడీ అవ్వడం.  మరి  నిత్యమీనన్ ఏ పాత్రలు బడితే ఆ పాత్రలు ఒప్పేసుకోకుండా తనకి నచ్చిన వాటినే ఎంపిక చేసుకుంటూ చాలా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. తనకి ఆ సినిమాలో కేరెక్టర్ నచ్చకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా నిత్య రిజెక్ట్ చేసేది. ఇంకా అందాల ఆరబోతకు కూడా ఆమె ఆమడ దూరం గా ఉంటుంది. అలాగే గ్లామర్ పరం గా కూడా గిరి గీసుకుని కూర్చింది. మరి అలా ఉంటే ఛాన్స్ లు సరిగా రావుకదా అనుకుంటున్నారేమో. కానీ నిత్యని ఇప్పటివరకు మంచి పాత్రలే వరించాయి. అయితే ఇప్పుడు సీన్ అలా లేదంట. ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్స్ రావడం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి నిత్యాకి సినిమాలేం లేక ఖాళీగా ఉందని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి నేను హాట్ , గ్లామర్ గా కనిపించను అని మడి కట్టుకుని కూర్చుంటే జరగదని అందుకే ఇలా గ్లామర్ కి ఇంపార్టెన్స్ పాత్రలను కూడా ఒప్పుకుంటుందని... అలాగే తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకున్నా కూడా ఆ సినిమాని ఒప్పుకోవడానికి రెడీ అయిందని అంటున్నారు. అసలు నిత్యాలో ఇంత మార్పు రావడానికి కారణం... తన తోటి హీరోయిన్స్ అంతా ఎంచక్కా చేతినిండా సినిమాల్తో బిజీగా ఉండి... ఎక్కడా అందాల ఆరబోతకు నో చెప్పకుండా ఉండడం వల్ల వాళ్ళ కెరీర్ సాఫీగా సాగిపోతుందని.. మరి నేను ఇలా భీష్మించుకుని కూర్చుంటే లాభం లేదనుకుని అందాల ప్రదర్శనకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs