ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ ఎదురైందనే చెప్పాలి. ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. ఓటుకు నోటు కేసుని నాలుగు వారాల్లో తేల్చి వేయాలని అందుకు సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు, హైకోర్టు కు పంపింది.
అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని కూడా విచారించాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆళ్ల తరఫు నుండి సీనియర్ న్యాయవాది నాప్రే వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా హైకోర్టు 8 వారలు స్టే ఇచ్చింది. ఈ అంశం విషయంలో తాము విచారణకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది. కానీ నాలుగువారాల్లో ఓటుకు నోటు కేసుని విచారించాలని సుప్రీంకోర్టు, హైకోర్ట్ ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో ఉన్నట్టుంది ఒక్కసారిగా తెదేపా అధినేత బాబుకు కొత్త సమస్య వచ్చి పడటంతో ఆలోచనలో పడి మదన పడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.